ఆంధ్రప్రదేశ్‌

నేనో పట్టాన తృప్తి పడను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 21: రాజధాని డిజైన్ల ఖరారు విషయంలో తాను అనుకున్న రూపు వచ్చేవరకూ మెరుగైన మరిన్ని డిజైన్లను పరిశీలిస్తూనే ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆయన రాజధాని డిజైన్లు, ఉద్యోగుల బదిలీలు, ఇటీవల కేంద్రహోం శాఖ ఉన్నత విద్యామండలి విభజనపై ఇచ్చిన ఆదేశాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 9,10వ షెడ్యూల్‌లో ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపకాలపై ఇటీవల కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులపై చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ అంశంపై కోర్టుకైనా వెళ్దామన్నారు. ముందు ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి, ఒత్తిడి చేద్దామన్నారు. మనం మిత్రపక్షంగా ఉన్నా అన్నింటికీ ఆమోదించాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యమని స్పష్టం చేశారు.
కాగా, రాజధాని డిజైన్లపై గంట సేపు చర్చ జరిగింది. ఇటీవల లండన్ వెళ్లి డిజైన్లపై అధ్యయనం చేసి వచ్చిన ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ దానిపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను మంత్రులు ఆసక్తిగా తిలకించారు. నార్మన్‌ఫోస్టర్స్ డిజైన్లపైనా చర్చ జరిగింది. తర్వాత దానిపై బాబు మాట్లాడుతూ తాను ఏ విషయంపైనా ఒకపట్టాన తృప్తి పడనని చెప్పారు. తాను సీఎంగా ఉన్నప్పుడు కట్టిన హైటెక్ సిటీ కూడా అనేక డిజైన్లను పరిశీలించి, సంతృప్తి చెందిన తర్వాతే ఇప్పటి హైటెక్ సిటీ రూపొందిందని చెప్పారు. రాజధాని నగర నిర్మాణానికి ఇంకా మెరుగైన డిజైన్లపై అధ్యయనం చేయాలని సూచించారు.
తర్వాత చర్చ ఉద్యోగుల బదిలీపైకి మళ్లింది. బదిలీ సీజన్ వస్తుందంటేనే భయమేస్తోందని బాబు నవ్వుతూ అన్నారు. ఈసారి బదిలీలు పారదర్శకంగా ఉండాలని, ఎక్కడా అవినీతి ఆరోపణలను తావివ్వకూడదని, అలా చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు. మీరు నేరుగా జోక్యం చేసుకోకపోవచ్చు. కానీ మీ పేరుమీద సన్నిహితులో, ఇంకెవరో బదిలీల్లో జోక్యం చేసుకోవచ్చు. అందుకే నేను రోజూ మానిటరింగ్ చేస్తానని చెప్పారు. మిర్చి రైతుల సమస్య చర్చకు వచ్చినప్పుడు దానిపై స్పందించిన మంత్రి సోమిరెడ్డి, 70 కోట్లతో మిర్చి పౌడర్ తయారుచేసే యూనిట్లను గుంటూరులో పెడితే మార్కెటింగ్ బాగుంటుందని, వారికీ కొంచెం ఊతమిచ్చినట్టవుతుందని సూచించగా, బాబు తమాషా నవ్వుతూ.. చంద్రమోహన్‌రెడ్డీ నీకు ఫాస్ట్ ఎక్కువయింది. ప్రభుత్వం ఎక్కడైనా వ్యాపారం చేస్తుందా? మళ్లీ మధ్యలో సరిగ్గా నడపకుండా మానేస్తే పరిస్థితి ఏమిటి? కాబట్టి ఇవన్నీ కాదు. అలాంటి యూనిట్లు పెట్టే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి, వారికి ప్రభుత్వపరంగా ఇచ్చే సబ్సిడీలు ఇస్తే సరిపోతుంది అని నవ్వుతూ అనడంతో మంత్రులంతా జతకలిపారు. ఇటీవల బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూపురం నియోజకవర్గంలో నెలకొన్న నీటిసమస్యలపై విపక్షాలు,ప్రజలు చేసిన ధర్నాను నారాయణ దృష్టికి తీసుకువెళ్లిన సందర్భంలో బాబు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత సీరియస్ ఇస్యూ ఉంటే మీ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తోంది? మీ డైరెక్టర్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారాయన? మీరు పిలిచి ఎందుకు మాట్లాడలేదు? ఇకపై ఇలా జరిగితే సహించేది లేదని తీవ్ర స్వరంతో హెచ్చరించడంతో, నారాయణ వౌనం వహించాల్సి వచ్చింది.