ఆంధ్రప్రదేశ్‌

ఎర్ర ‘బుగ్గ’ తీశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 21: కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్రంలోని మంత్రుల కార్లకు ఎర్ర బుగ్గలను శుక్రవారం తొలగించారు. ఐఎఎస్, ఐపిఎస్ తదితర ఉన్నతాధికారుల కార్లకు ఉన్న బుగ్గలను కూడా తొలగించారు. సిఎం, మంత్రులు, కొంతమంది ప్రజాప్రతినిధులు, గవర్నర్, హైకోర్టు జడ్జిలు, ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల కార్లకు ఎర్ర, నీలి బుగ్గలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం మరికొంతమందికి కూడా అనుమతించింది. రాజ్యాంగపరమైన ప్యానెల్ సభ్యులకు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌లకు, నగర పాలక సంస్థ మేయర్ల కార్లకు కూడా ఎర్ర బుగ్గ ఏర్పాటు చేసుకునే వీలు కల్పించారు. విప్‌లకు కూడా ఈ అవకాశం కల్పించారు. ఎర్ర బుగ్గ ఉన్న కారుకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో ఎక్కువ మంది దీనిని పెట్టుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. చాలా సందర్భాల్లో కొంతమంది అధికారుల, ప్రజాప్రతినిధుల బంధువులు దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వచ్చినా స్పందించిన దాఖలాలు లేవు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు కూడా ఎర్ర బుగ్గను ఉపయోగించకూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం పట్టించుకోని పరిస్థితుల్లో కేంద్ర మంత్రివర్గ నిర్ణయం తప్పనిసరిగా అమలు చేయాల్సి వచ్చింది.