ఆంధ్రప్రదేశ్‌

మాజీని హతమార్చిన మావోయిస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, ఏప్రిల్ 22: ఒడిశాలోని కొరాపుట్ జిల్లా నారాయణపట్నం మండలం బందుగాం పంచాయతీ బొరిగి గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు పీడిక రథు (42)ను శనివారం వేకువ జామున 4 గంటల సమయంలో మావోయిస్టులు దాడి చేసి హతమార్చారు. ఈదాడిలో దాదాపు 40 మంది వరకు మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారం. ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో రథును ఇంటి బయటకు తీసుకువచ్చి కొట్టి హతమార్చినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం-కొరాపుట్ డివిజన్ కమిటీ సిపిఐ (మావోయిస్టు)కి చెందిన మావోయిస్టులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. మాజీ సంఘ నాయకులు, పోలీసులు, షావుకార్లు ఆక్రమించుకున్న భూములను విడిచిపెట్టాలని ఎబివో కొరాపుట్ జిల్లా బందుగాం బ్లాక్ కత్తులపేట, అలమండలో మావోలు బ్యానర్లు కూడా కట్టి ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. భూములు విడిచిపెట్టకపోతే తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించిన వారు అన్నంత పనిచేశారని తెలుస్తోంది. షావుకార్లకు మద్ధతుగా ఉంటున్న మాజీ మావోయిస్టును హతమార్చిన మావోయిస్టులు మరిన్ని సంఘటలకు పాల్పడే అవకాశాలున్నాయని ఆప్రాంతానికి చెందిన షావుకార్లు ఆందోళనతో భీతిల్లుతున్నారు. మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో ఎఒబిలో ఆంధ్ర, ఒడిశా పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ కూడా నిర్వహించినా ఫలితం లేకపోయింది. ఇకపై మావోయిస్టులు ఎలాంటి సంఘటనలకు పాల్పడతారోనన్న ఆలోచనతో ఒడిశా పోలీసులు కూడా మావోలపై నిఘా మరింత పెంచారు.