ఆంధ్రప్రదేశ్‌

మీ అభిప్రాయాలు పిల్లలపై రుద్దకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 22: ఇంజనీరింగ్, మెడిసిన్ ఒక్కటే జీవితం కాదని, అంతకన్నా ఉన్నతమైన కోర్సులు మన దేశంలో ఉన్నాయని, వాటి పట్ల విద్యార్థులు మక్కువ కనబర్చి ప్రయోజకులు కావాలని రాష్ట్ర గవర్నర్, విశ్వ విద్యాలయాల కులపతి ఇఎస్‌ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళా మందిర్‌లో శనివారం కృష్ణా విశ్వవిద్యాలయం నాల్గో స్నాతకోత్సవం జరిగింది గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెలుగు భాషా సంస్కృతికి విశేషంగా కృషి చేస్తున్న ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌కు విశ్వ విద్యాలయం తరపున గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. అలాగే పలు అంశాల్లో పిహెచ్‌డిలు చేసిన ఏడుగురికి డాక్టరేట్‌లు, అత్యుత్తమ ప్రతిభకనబర్చిన నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. గవర్నర్ నరసింహన్ కీలకోపన్యాసం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే పిల్లల భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లితండ్రుల ఆశలను పిల్లలపై రుద్దటం వల్ల వారు అనేక ఒత్తిళ్లకు గురై జీవితాన్ని కోల్పోతున్నారన్నారు. దీని వల్ల నష్టపోయేది తల్లిదండ్రులే అన్న వాస్తవాన్ని గుర్తించాలన్నారు. పిల్లలకు స్వేచ్ఛ ఇచ్చి వారు ఎంచుకున్న రంగాల్లో నిలబడేలా తల్లిదండ్రులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమాజాభివృద్ధి కోసమే విద్యనభ్యసించాలే తప్ప ధనార్జన కోసం కాదన్నారు. భారత్ ఇతర దేశాలకు ఏ మాత్రం తీసిపోమన్నారు. ఏ దేశంలోనూ లేని భిన్నత్వంలో ఏకత్వం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇక్కడ ఉందన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు, రిజిస్ట్రార్ డి సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
నా తండ్రికి అంకితం: మండలి
సంస్కృతి అనేది ఒక జీవన వ్యవస్థ అని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళా మందిర్‌లో శనివారం కృష్ణా విశ్వ విద్యాలయం నాలుగో స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అందుకున్న బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మన ఆచారాలు, కళలు, ఆచార వ్యవహారాలు, మానవ సంబంధాలన్నీ మన సంస్కృతిలో ఇమిడి ఉన్నాయన్నారు. విశ్వ విద్యాలయం తనకు డాక్టరేట్‌ను ప్రదానం చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. కానీ ఈ డాక్టరేట్ తనకు దక్కాల్సింది కాదని తెలుగు భాషాభివృద్ధికి బీజం వేసిన తన తండ్రి మండలి వెంకట కృష్ణారావుకు దక్కాల్సిందన్నారు. కానీ ఆ నాడు ఆ ఆలోచన ఎవరికీ రాలేదన్నారు. తనకు లభించిన డాక్టరేట్‌ను తన తండ్రికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎంత ఉన్నతంగా ఎదిగినా మన సంస్కృతి, సాంప్రదాయాలను మరవకూడదన్నారు. విదేశాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న మన తెలుగు వారంతా మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహిస్తున్నారన్నారు.

చిత్రం..గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్
అందుకుంటున్న శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్