ఆంధ్రప్రదేశ్‌

రాజధాని భవనాల్లో గ్రీన్ ఎనర్జీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 30: ఎనర్జీలో నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతి నంబర్ వన్ స్థానంలో నిలవాలని రాజధాని ప్రాంత నగరాభివృద్ధి సంస్థ (సిఆర్‌డిఏ)ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నగర నిర్మాణంలో ‘గ్రీన్ ఎనర్జీ’ అంతర్భాగంగా ఉండేలా ప్రతి భవనం ఉండాలని, ఇలాంటి విధానానికి రూపకల్పన చేయాలని సూచించారు. రాజధాని నగరం పర్యావరణ పరిరక్షణకు దోహదపడే విద్యుత్ ఉత్పత్తి, వినియోగంతో ప్రపంచ ఖ్యాతి పొందేలా డిజైన్లు రూపొందించాలని సిఆర్‌డిఏ అధికారులను ఆయన ఆదేశించారు. అమరావతిని గ్రీన్ ఎనర్జీ సిటీగా మలచేలా సహకారం అందించేందుకు స్విట్జర్లాండ్ (స్విస్) ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి నగరాన్ని గ్రీన్ ఎనర్జీ సిటీగా మార్చడంలో స్విస్ భాగస్వామ్యమందించేందుకు వచ్చినందున ప్రతి నిర్మాణం ఆహ్లాదంగా, అందంగా విద్యుత్ పొదుపు, సంరక్షణ విధానాలతో కూడినదిగా ఉండేలా డిజైన్ల రూపకల్పన నిబంధనలు అమలుచేయాలని సూచించారు. రాష్ట్ర రాజధాని నగర నిర్మాణంలో అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన సంస్థలు భాగస్వామ్యమయ్యేందుకు ముందుకు వస్తున్నందున ఆ స్థాయిలోనే డిజైన్లు రూపొందించాలని తన నివాసం నుంచి ఆదివారం సిఆర్‌డిఏ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఆదేశించారు. ఈసందర్భంగా ఇంధన రంగంలో ప్రపంచ ఖ్యాతి చెందేలా గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యమిస్తూ మొదటి స్థానంలో ఉండాలని ఆదేశించారు. స్విస్ ప్రభుత్వ సంస్థ ఫెడరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ (ఎఫ్‌డిఎఫ్‌ఏ) విజయవాడ నగరంలో మే 2న జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనుండటాన్ని ఆయన స్వాగతించారు. అంతర్జాతీయ సంస్థలు రాజధాని నగరానికి రావడాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిఆర్‌డిఏ అధికారులకు సూచించారు. రాజధాని నగరంలో సామాన్యుల భవనాలు గ్రీన్ ఎనర్జీతో కూడినవిగా ఎలా ఉండాలో అవగాహన కల్పించేలా ప్రభుత్వ కార్యాలయ భవన సముదాయాలు ఉండాలన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి పి నారాయణ మాట్లాడుతూ అమరావతి నగరంలోని భవన నిర్మాణాలు విద్యుత్‌ను పొదుపుగా వాడేలా ఉండడమే కాకుండా విద్యుత్ రంగ సుస్థిరతకు దోహదపడేలా ఉండాలని అధికారులకు సూచించారు. ఇండో-స్విస్ భాగస్వామ్యంలో అమరావతిని ఒక అద్భుత నగరంగా మలచేందుకు కృషి చేస్తామని వౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వివరించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వమూ సహకారం అందిస్తోందన్నారు. అమరావతి నగర నిర్మాణంలో భాగస్వాములయ్యే సిఆర్‌డిఏ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, ఉన్నతాధికారులు మే 2న జరిగే వర్క్‌షాప్‌లో పాలుపంచుకుంటారని తెలిపారు. ఈ వర్క్‌షాప్ నిర్వహించేందుకు అమరావతిని ఎంచుకున్నందుకు కేంద్రానికి సిఆర్‌డిఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ విధానాలను విస్తరించేలా చేయడంలో రాష్ట్ర ఇంధన పొదుపు, సంరక్షణ సమితి (ఎస్‌ఈసిఎం) స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ (ఎస్‌డీఏ)గా వ్యవహరిస్తోందని చెప్పారు. ఈ సంస్థ కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ, స్విస్‌కు చెందిన ఫెడరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్‌కు అనుసంధానంగా వ్యవహరిస్తుందని ఆయన వివరించారు.