ఆంధ్రప్రదేశ్‌

జగన్ రైతుదీక్ష ఓ డ్రామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 30: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రైతుదీక్ష పేరుతో మరోసారి డ్రామాలాడుతున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఆదివారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జైలుకెళ్లాల్సి వస్తుందనే భయంతో ఒకసారి గుంటూరులో దీక్షను వాయిదా వేసుకుని తిరిగి సోమవారం నుంచి ప్రారంభిస్తామని ప్రకటించటంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రైతుల పక్షాన దీక్ష చేసే అర్హత జగన్‌కు లేదన్నారు. వైఎస్ హయాంలో నకిలీ విత్తనాలు, ఎరువుల కంపెనీలకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చారని, అందులో భాగంగానే ఇటీవల జీవా, బ్రహ్మపుత్ర కంపెనీలు రైతుల్ని నిట్టనిలువునా ముంచాయని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం నకిలీలను నియంత్రించడంతో పాటు రూ.16 వేల కోట్ల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ రూ.24వేల కోట్ల మేర రైతులకు రుణమాఫీ చేసిందని స్పష్టం చేశారు. రుణమాఫీ సాధ్యపడదని, దానివల్ల బ్యాంకర్లు నష్టపోతారని, పరపతి ఉండదని వైఎస్ కుటుంబం వ్యతిరేకించటంతో పాటు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చలేదని గుర్తుచేశారు. రైతు వ్యతిరేకిగా ముద్రపడిన జగన్ దీక్షలు చేపట్టటాన్ని ఫార్స్‌గా కొట్టిపారేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాలో రూ. 2500 కోట్ల మేర పంటలను కాపాడిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. నాటి జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని, కమిషన్లు దండుకుని సెజ్‌ల పేరుతో అమాయక రైతుల నుంచి లక్షలాది ఎకరాల భూములు కొల్లగొట్టిన ఘనత వైఎస్ కుటుంబానికే దక్కుతుందన్నారు. సాగుకు నీరందించటంలో విఫలమై 7 గంటల విద్యుత్‌ను అందించలేని వైఎస్ కుటుంబానికి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తమ ప్రభుత్వం నిరాటంకంగా 24 గంటల విద్యుత్ సరఫరాతో పాటు 9 గంటలు వ్యవసాయానికి సరఫరా చేస్తోందన్నారు. కరవు పరిస్థితులను అధిగమించేందుకు పసుపు, మిర్చి, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు, మద్దతు ధర కల్పించటంతో పాటు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నామన్నారు. కృష్ణాజలాల విషయంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట పసలేని వాదనలు వినిపించి, ఆల్మట్టి డ్యాం విషయంలో ఉదారంగా వ్యవహరించిన వైఎస్ రాష్ట్ర రైతులకు తీరని వ్యథ మిగిల్చారని ఆరోపించారు.