ఆంధ్రప్రదేశ్‌

ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 30: పట్టణంలోని రెండు రైల్వే వంతెన పనులకు ఆమోదం లభించడంతో ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. ఆదివారం ముంబయి నుంచి కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు వీడియో కానె్ఫరెన్స్ లింకింగ్ ద్వారా, ఇక్కడ రైల్వేస్టేషన్ నుంచి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రోడ్ అండర్ బ్రిడ్జి పనులకు ఏక కాలంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ రైల్వే స్టేషన్లకు మరిన్ని సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు వంటి సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు. పట్టణంలోని బిసి కాలనీ వద్ద రూ.1.80 కోట్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద రూ.3.38 కోట్లతో పనులు చేపడతారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఎం మాధూర్, జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్సీలు సంధ్యారాణి, గాదె శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యే గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆదివారం ఆనందమయం కావాలి
పట్టణ వాసులు ఆదివారం ఉల్లాసంగా కాలం గడపాలని కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం పట్టణంలో హ్యాపీ స్ట్రీట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సమేతంగా అందరు ఆటపాటలతో గడపాలని ఈ కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. సైక్లింగ్, క్రికెట్, స్కేటింగ్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, షటిల్ వంటి ఆటలతోపాటు డాన్స్, యోగ వంటి వాటిని సాధన చేసుకునే వీలుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఎల్‌కెవి రంగారావు, ఎమ్మెల్యేలు గీత, కెఎ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సైకిల్‌పై వస్తున్న కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, పక్కన ఎమ్మెల్యే, కలెక్టర్ తదితరులు