ఆంధ్రప్రదేశ్‌

త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 30: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో అన్ని రకాల నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తుందని, పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఎపి టిడిపి అధ్యక్షుడు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఆదివారం కళా వెంకట్రావు విలేఖరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు సముచిత గౌరవం లభిస్తుందని చెప్పారు. చంద్రబాబు చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సిన బాధ్యత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలపై ఉందన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అన్ని వర్గాలతో మమేకం కావాలన్నారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయడం ద్వారా 2019లో చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రి చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ కోతలు లేవని, 24 గంటలూ గృహాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం డిజిటలైజేషన్ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కేవలం సాంకేతికపరమైన సమస్యల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది తప్పితే, రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. 2014లో రోజుకు కేవలం 6 గంటలే విద్యుత్ సరఫరా జరిగేదని, చంద్రబాబు అధికారంలోకి రాగానే 24 గంటలు విద్యుత్ అందిస్తున్నారన్నారు. హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్‌లు, ధర్మల్ పవర్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చేశామని మంత్రి పేర్కొన్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌ను ముఖ్యమంత్రి తీసుకురానున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఘనత కూడా చంద్రబాబుకే దక్కిందన్నారు. నీరు-చెట్టు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. చెరువుల మరమ్మతులు, కాలువలు, చెక్‌డ్యాంల నిర్మాణం ద్వారా ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కళా వెంకట్రావు పేర్కొన్నారు. సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు, కాకినాడ ఎంపి తోట నరసింహం, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి కిమిడి కళా వెంకట్రావు