ఆంధ్రప్రదేశ్‌

రైతుల సమస్యలు వదిలేసి విదేశీ పర్యటనలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 30: ఒకపక్క కరవుతో అల్లాడుతూ, మరోపక్క గిట్టుబాటు ధరలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారి సమస్యలను గాలికొదిలేసి మందీమార్బలాన్ని వెంటేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలు చేయటం ఎంతవరకు సమంజసమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆక్షేపించారు. ప్రతిపక్ష నేత జగన్ గుంటూరులో చేపట్టనున్న రైతుదీక్ష శిబిరాన్ని ఆదివారం వైసిపి ముఖ్య నేతలు పరిశీలించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో వ్యవసాయ రంగం కుదేలైందని విమర్శించారు. రాష్టమ్రంతటా కరవుకాటకాలతో కొట్టుమిట్టాడుతుంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అన్నదాతలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం రాజీ ధోరణి అవలంబిస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 44 లక్షల హెక్టార్లు ఉండగా 37 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయని, రబీలో 24 లక్షల హెక్టార్లకు గాను 18 లక్షల హెక్టార్లలో మాత్రమే రైతులు పంటలు పండించారని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ధరల స్థిరీకరణకు రూ.5వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ఇప్పటివరకు అమలుచేయక అన్నదాతను మోసగించిందని ధ్వజమెత్తారు. మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం విడతల వారీగా ఇస్తున్న కొద్దిపాటి మొత్తం అన్నదాతలు చెల్లిస్తున్న వడ్డీకి 20శాతం కూడా సరిపోదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతులు, రైతుకూలీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మద్దతు ధర కల్పించేందుకే జగన్ దీక్ష చేపట్టారన్నారు. అయితే దీక్షను భగ్నం చేసేందుకు ప్రభుత్వం అన్నివిధాలా ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే మిర్చియార్డుకు సెలవులు ప్రకటించిందని ఆరోపించారు. అయితే రాష్ట్రంలోని రైతులు, రైతుకూలీలు స్వచ్ఛందంగా దీక్షకు తరలివచ్చి మద్దతు తెలుపుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇక సోషల్ మీడియా పేరుతో మీడియా గొంతునొక్కే ప్రయత్నం చేస్తే వ్యవస్థలతో పాటు ప్రజలు తిరగబడతారనే నగ్నసత్యాన్ని ప్రభుత్వం గుర్తెరగాలని విజయసాయిరెడ్డి హితవు పలికారు.