ఆంధ్రప్రదేశ్‌

దేదీప్యమానం ఆదిశంకరుని అద్వైత సిద్ధాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), ఏప్రిల్ 30: పిన్న వయస్సులోనే తన తపో, ధ్యాన, జ్ఞానశక్తిని సమస్త మానవాళి కోసం ధారపోసి, ఆసేతు హిమాచల పర్యంతం కాలినడకన రెండు పర్యాయాలకు పైగా పర్యటించిన జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య అద్వైత సిద్ధాంతం మన ప్రాచీన హైందవ సనాతన ధర్మానికి దేదీప్యమానంగా వెలిగే దీపస్తంభమని విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీస్వామి శ్లాఘించారు. ఆదివారం నగరానికి వచ్చిన స్వామీజీ బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో దాత మర్రెడ్డి రామకృష్ణారెడ్డి - మృదుల దంపతులు మేలైన రత్నాలు, బంగారంతో సుందరంగా తీర్చిదిద్దిన రెండున్నర కిలోల సువర్ణ వక్షస్థల ఆభరణాన్ని వెంకన్నకు అలంకరించారు. ఈసందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాదిమంది భక్తులు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య జయంతి ఉత్సవాన్ని కూడా వైభవంగా జరుపుకున్నారు. స్వామీజీ అనుగ్రహ భాషణ చేస్తూ.. రాజధాని అమరావతిలో తప్పనిసరిగా రానున్న కాలంలోనే శ్రీ ఆదిశంకరాచార్య నిలువెత్తు విగ్రహం, ధ్యానమందిరం, వేద పాఠశాల ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి సూచించారు. సామాన్యుడైనా, అసామాన్యుడైనా అందరిలో సర్వేశ్వరుడు కొలువై ఉన్నాడనే సత్యాన్ని 14 వందల సంవత్సరాలకు పూర్వమే లోకానికి ఎలుగెత్తి చాటిన శ్రీ శంకరుడు అఖండ తేజోమయ సంపన్నుడన్నారు. దేవాలయ వ్యవస్థ అత్యంత పవిత్రమైందని, ఈ వ్యవస్థను కాపాడుకోవటంలో ప్రతిఒక్కరూ కృషిచేయాలని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పిలుపునిచ్చారు.

చిత్రం..అనుగ్రహ భాషణ చేస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి