ఆంధ్రప్రదేశ్‌

నాటకానికి పట్ట్భాషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 30: సాంస్కృతిక ప్రాచీన ప్రాశస్థ్యం కలిగిన చారిత్రక రాజమహేంద్రవరం గోదావరి తీరం కళాకారులతో కోలాహలంగా మారింది. రాజమహేంద్రవరం శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఆదివారం కందుకూరి నాటక రంగస్థల పురస్కారాలు, ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం, నంది నాటకోత్సవ బహుమతుల ప్రదానోత్సవంగా వైభవంగా జరిగింది.
నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారాన్ని 2016 సంవత్సరానికి సంబంధించి 98 ఏళ్ల సీనియర్ కళాకారులు గుమ్మడి గోపాలకృష్ణ స్పీకర్ కోడెల శివప్రసాద్ చేతుల మీదుగా అందుకున్నారు. 2017 రాష్టస్థ్రాయి కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారాలను కర్నాటి లక్ష్మీ నరసయ్య, చింతా కబీర్‌దాస్, అగ్గరపు రజనీబాయి స్పీకర్ కోడెల శివప్రసాద్ మీదుగా అందుకున్నారు. ఒక్కొక్కరికి రూ.లక్ష నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. 13 జిల్లాల నుంచి జిల్లాకు ఐదుగురు చొప్పున 65 మందికి కందుకూరి జిల్లా స్థాయి విశిష్ట పురస్కారాలు అందజేశారు. వీరికి ఒక్కొక్కరికి రూ. 10వేల నగదు బహుమతితోపాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
అనంతరం 2016 నంది అవార్డుల ప్రదానోత్సవం కోలాహలంగా జరిగింది. నటులు, సాంకేతిక నిపుణులు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ హాస్య నటి, ఉత్తమ హాస్య నటుడు, ఉత్తమ బాలనటి, ఉత్తమ బాల నటుడు, ఉత్తమ ప్రతి నాయకుడు, ఉత్తమ లైటింగ్, ఉత్తమ మేకప్, ఉత్తమ నాటిక రచయిత విభాగాలకు నంది బహుమతులు అందుకున్నారు. పద్యనాటకం, సాంఘిక నాటకం, నాటిక, విద్యార్ధి నాటిక, బాలల నాటిక విభాగాలకు సంబంధించి బంగారు, వెండి, కాంస్య నంది బహుమతులను స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రదానం చేశారు.
పద్యనాటకం విభాగంలో ఉత్తమ ప్రధమ ప్రదర్శనగా అనంతరం పురానికి చెందిన లలిత కళా పరిషత్ ప్రదర్శించిన సతీ సావిత్రి ప్రదర్శనకు బంగారు నంది, రూ. 80వేల నగదు పారితోషికం అందించారు. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా కర్నూలుకు చెందిన లలిత కళా సమితి సమర్పించిన ప్రమీలార్జున పరిణయంకు వెండి నంది బహుమతితో పాటు రూ. 60వేల నగదు పారితోషికాన్ని అందించారు. తృతీయ ఉత్తమ ప్రదర్శనగా ఖమ్మం కల్చరల్ అసోసియేషన్‌కు చెందిన చాణక్య చంద్రగుప్త ప్రదర్శన గెల్చుకుంది. కాంస్య నంది, రూ. 40వేల నగదు పారితోషికాన్ని అందుకున్నారు.
సాంఘిక నాటకం విభాగంలో ఉత్తమ ప్రధమ ప్రదర్శనగా గంగోత్రి పెదకాకాని అక్షర కిరీటం ప్రదర్శనకు బంగారు నందితో పాటు రూ. 70వేల నగదు పారితోషికాన్ని అందించారు. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా కళాంజలి హైదరాబాద్ వారి జారుడుమెట్లు ప్రదర్శనకు లభించింది. వెండి నందితో పాటు రూ. 50వేల నగదు పారితోషికాన్ని అందించారు. తృతీయ ఉత్తమ ప్రదర్శనగా విజయాదిత్య రాజమహేంద్రవరం వారి ఇంటింటి కధ ప్రదర్శన అందుకుంది. కాంస్య నందితో పాటు రూ. 30వేల నగదు పారితోషికాన్ని అందించారు. కళాకారులకు, సాంకేతిక నిపుణులకు వ్యక్తిగత బహుమతులు అందజేశారు.
పురస్కారాల ఎంపిక కమిటీ ఛైర్మన్, ఎంపి మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ, నాటకం పుట్టిందీ, తొలి నాటకం ప్రదర్శన జరిగింది చారిత్రక రాజమహేంద్రవరంలోనేనని, అందుకే ఈ పురస్కారాలు, నంది బహుమతులను ఈ నేలపై ప్రదానం చేశామన్నారు. ఇటీవల మ్మతి చెందిన వేల ప్రదర్శనలు ఇచ్చిన నాటకరంగ దిగ్గజం సంపతనగరం లక్ష్మణరావు మృతికి ఈ సభ సంతాపం తెలియజేస్తూ నివాళి అర్పించింది. 2017 రాష్ట్ర స్థాయి కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కార గ్రహీత కర్నాటి లక్ష్మీనరసయ్య తనకు జరిగిన సన్మానం అనంతరం మాట్లాడుతూ ఈ పురస్కారంతో తన జీవితానికి సార్ధకత లభించిందన్నారు. కందుకూరి తెలుగుజాతి గర్వించదగిన వ్యక్తని, అటువంటి మహనీయుడి పేరుతో ఇచ్చిన ఈ పురస్కారం ఇవ్వడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. కాటన్ ఈ ప్రాంతాన్ని సిరి గోదావరిగా మార్చితే, కందుకూరి తన రచనలతో సాహితీ గోదావరిగా మార్చారన్నారు. మరో పురస్కార గ్రహీతలు చింతా కబీర్ దాస్, సురభి కుటుంబానికి చెందిన 23వేల ప్రదర్శనలు ఇచ్చిన అగ్గరపు లక్ష్మీబాయి మాట్లాడుతూ, ఈ పురస్కారాలతో తమ జన్మ తరించిందన్నారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. కందుకూరి పురస్కారాల జ్యూరీ ఎంపి మాగంటి మురళీమోహన్, పాటిబండ్ల ఆనందరావు, ఎస్. బాలచంద్రరావు, డి. ఓబులయ్య, ఎస్. వెంకటేశ్వర్‌లను స్పీకర్ కోడెల ఘనంగా సత్కరించారు.

చిత్రం......నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారాన్ని గుమ్మడి గోపాలకృష్ణకు అందజేస్తున్న స్పీకర్ కోడెల