ఆంధ్రప్రదేశ్‌

కవి యుగ చక్రవర్తి వేమన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 30 : వేమన సాహిత్యం తెలుగు ప్రజలకు తరగని సంపద అని, తెలుగు జాతికి కీర్తి, స్ఫూర్తినింపిన కవియుగ చక్రవర్తి వేమన అని ప్రముఖ సాహితీ విమర్శకులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాళెం చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలో ఆదివారం సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ‘ప్రజాకవి వేమన సాహితీ సమాలోచన సదస్సు’ నిర్వహించారు. రాష్టస్థ్రాయిలో జరిగిన ఈ సదస్సుకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, అనంతపురం నగర ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాచపాళెం మాట్లాడుతూ, మహాకవుల సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సాహితీ స్రవంతి పనిచేస్తోందని, ఈ క్రమంలోనే వేమన సాహితీ సమాలోచన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. శ్రీశ్రీ పేర్కొన్న తెలుగు భాషలోని ముగ్గురు మహాకవుల్లో వేమన ఒకరన్నారు. వేమన ప్రాచీన కవుల్లో ఆధునికుడని, తన కాలం కంటే చాలా ముందున్న వ్యక్తి అన్నారు. సమాజంలోని మూఢాచారాలు, కల్మషాన్ని ధైర్యంగా, సూటిగా ప్రశ్నించిన, విమర్శించిన వాడు అన్నారు. రాజకుటుంబం నుంచి వచ్చిన వాడు అనే మాట నిజమైతే వేమన కూడా మరో గౌతమబుద్ధుడే అన్నారు. క్రీ.శ. 1730 నాటికే వేమన పద్యాలు దేశం ఎల్లలు దాటి వెళ్లాయన్నారు. విశ్వమానవ ప్రేమను ప్రతిపాదించిన కవి యోగి వేమన అన్నారు. వానలో తడవని వారు, వేమన పద్యం వినని తెలుగు వారే లేరన్నారు. అనంతరం వేమన సాహిత్యంపై రూపొందించిన 14 పుస్తకాలను ఆవిష్కరించారు. సదస్సుకు వివిధ జిల్లాల నుంచి ప్రముఖ కవులు, రచయితలు, సాహితీవేత్తలు హాజరయ్యారు.

చిత్రం..ప్రజాకవి వేమన సాహితీ సమాలోచన సదస్సులో ప్రసంగిస్తున్న రాచపాళెం చంద్రశేఖరరెడ్డి