ఆంధ్రప్రదేశ్‌

హైవే భూసేకరణ సర్వేను అడ్డుకున్న రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజెండ్ల, ఏప్రిల్ 30: అనంతపురం - అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే జంక్షన్ భూసేకరణ సర్వేను ఆదివారం గుంటూరు జిల్లా నూజెండ్ల మండల రైతులు అడ్డుకున్నారు. నూజెండ్లలోని జెమిని పాల కేంద్రం సమీపంలో ఎక్స్‌ప్రెస్ హైవే అధికారుల బృందం భూములు సర్వే చేస్తున్నారనే సమాచారంతో సుమారు 200 మంది రైతులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే సర్వే ఆపాలని అధికారుల బృందానికి హెచ్చరికలు చేశారు. దీంతో అధికారులు సర్వే పనులు నిలిపివేశారు. అనంతరం నూజెండ్ల-దర్శి ఆర్ అండ్ బి రహదారిపై పురుగుమందు డబ్బాలతో రైతులు బైఠాయించి భూసేకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ హైవే కోసం తమ భూములు తీసుకున్నా అభ్యంతరం లేదన్నారు. జంక్షన్ పేరుతో 300 ఎకరాలు సేకరించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. నష్టపరిహారం ఎంత చెల్లిస్తారనే విషయాన్ని కనీసం తెలియపరచకుండా సర్వే చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్ని ఎకరాల భూమి కావాలనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పకుండా భూముల్లో జెండాలు పాతి తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. సర్వే ప్రారంభం నాటినుండి నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని, జీవనోపాధి పోతుందనే ఆందోళనలో ఉన్నామన్నారు. ప్రకాశం జిల్లాలో రోడ్డు నిర్మాణానికి 150 మీటర్లు సేకరిస్తుండగా, గుంటూరు జిల్లాలో 200 మీటర్ల వెడల్పు ఎందుకని నిలదీశారు. రోడ్డు వెడల్పు తగ్గించాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఎంత ఇస్తారనే విషయాన్ని స్పష్టం చేయకుండా భూసేకరణ చేయడం దారుణమన్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం నష్టపరిహారం అందించిన తరువాతే రోడ్డు పనులు ప్రారంభిస్తారని చెపుతున్నారే తప్ప ఇప్పటివరకు స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. తమ న్యాయం చేయకుంటే ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. రైతుల ఆందోళనతో సర్వేయర్ నాగేశ్వరరావు, సిబ్బంది వెనుదిరిగారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొందరు రైతులు మాత్రం నూజెండ్లలో జరుగుతున్న భూసేకరణపై గుంటూరు రైతుదీక్షలో ప్రతిపక్ష నేత జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోస్తామని చెపుతున్నారు. ఆందోళనలో నూజెండ్లకు చెందిన శ్రీరామనేని రమేష్, యనమదల చిరంజీవి, అమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఈపనగండ్ల వెంకటేశ్వర్లు, శ్రీరామనేని నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, బుర్రిపాలెం, లక్ష్మీపురం గ్రామాల రైతులు పాల్గొన్నారు.

చిత్రం..నూజెండ్లలో రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్న రైతులు