ఆంధ్రప్రదేశ్‌

అవయవదానంపై నేడు అవగాహన కార్యక్రమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 1: అవయవదానంపై భారీస్థాయిలో అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నట్టు రాష్ట్ర శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. సోమవారం అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో మంగళవారం నిర్వహించబోయే కార్యక్రమానికి 10వేల మందికి పైగా హాజరవుతారని స్పీకర్ చెప్పారు. ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి కూడా ఎక్కబోతోందని తెలిపారు. ఇందుకోసం ఇంగ్లండ్ నుంచి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు కూడా ఇప్పటికే నర్సరావుపేట చేరుకున్నారని చెప్పారు స్పీకర్ కోడెల శివప్రసాదరావు జన్మదినోత్సవం కూడా కావడంతో.. ఈ కార్యకమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు. అవయవదానాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. దురదృష్టవశాత్తూ ఎవరు చనిపోయినా.. వారి అవయవాలు దానం చేయడం ద్వారా 10 నుంచి 12 మందికి జీవించే అవకాశం కల్పించడమన్నది అరుదుగా వచ్చే అవకాశమని, సేవా దృక్పథంతో కూడా ఇలాంటి కార్యక్రమానికి అందరూ ముందుకు రావాలని స్పీకర్ కోడెల పిలుపునిచ్చారు. జిఎస్టీ బిల్లు ఆమోదం కోసం ఈనెల మూడవ వారంలో రెండు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు.
అగ్రహార సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు
రాష్ట్ర వ్యాప్తంగా వివాదాల్లో ఉన్న అగ్రహార గ్రామాల సమస్య పరిష్కారం దిశగా కృషి చేస్తున్నామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. పూర్వం దానంగా ఇచ్చిన అగ్రహార గ్రామాల్లోని భూముల ఆస్తి హక్కు వివాదాస్పదంగా మారింది. భూముల అసలు యజమానులు, వాటిని సాగుచేస్తున్న రైతులు, గ్రామస్తులు హక్కుల కోసం పోరాడుతున్నారని చెప్పారు.