ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో అమిత్‌షా పర్యటనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 1: 2019 సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీని బలోపేతం చేసేందుకు విశాఖలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్ తెలిపారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు గత నెల 29, 30న విశాఖలో జరిగాయన్నారు. ఈ సమావేశంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బలమైన శక్తిగా బిజెపిను రూపొందించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. పార్టీ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి సందర్భంగా సెప్టెంబర్ 25 నాటికి పోలింగ్ బూత్ స్థాయికి పార్టీని పటిష్టం చేస్తామని అన్నారు. కార్యకర్తలు వివిధ జిల్లాల్లో 15 రోజుల పాటు విస్తారక్‌లుగా ప్రచారం చేస్తారన్నారు. జూన్ 15-30 వరకు పోలింగ్ బూత్ కార్యక్రమాలు, జూన్ 21న యోగ దినోత్సవం, జూన్ 23న శ్యామ్‌ప్రకాష్ ముఖర్జీ బలిదాన దినోత్సవం, జూలై 6న ఆయన జయంతి కార్యక్రమం, మొక్కల పెంపకానికై ఉద్దేశించిన ‘వన్‌ధన్’ కార్యక్రమాలను విస్తారంగా నిర్వహిస్తామన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా రాబోయే 3,4 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో మూడుసార్లు పర్యటిస్తారన్నారు. ఈనెల 25న పోలింగ్ బూత్ సమావేశాలు విజయవాడలో జరగనున్నాయని దానికి అమిత్‌షా హాజరవుతారన్నారు. జూలై 15, 16 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశంలోను, ఆగస్టు 25, 26 తేదీల్లో రాష్ట్రంలో జరిగే ప్రవాస్ యోజన కార్యక్రమంలోను అమిత్‌షా పాల్గొంటారన్నారు.