ఆంధ్రప్రదేశ్‌

అంగన్‌వాడీ కేంద్రాలకు త్వరలో నూతన భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,మే 1:రాష్ట్రంలో అంగన్‌వాడి కేంద్రాలకు త్వరలో నూతన భవనాలను నిర్మించేందుకు అన్నివిధాలా చర్యలు తీసకుంటున్నట్లు రాష్ట్ర శిశుసంక్షేమశాఖమంత్రి పరిటాల సునీత వెల్లడించారు. సోమవారం సాయంత్రం ఒంగోలులోని ఎన్‌ఎస్‌పి అతిథిగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా చాలా చోట్ల అంగన్‌వాడి కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, వాటి వివరాలు సేకరించి నూతన భవనాలు నిర్మించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. అంగన్‌వాడి కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్లవిషయంలో రాజీపడే ప్రశక్తేలేదని తెల్చిచెప్పారు. త్వరలో కోడిగుడ్లకు సంబంధించి టెండర్లు పిలుస్తున్నామన్నారు. పెద్ద సైజు కోడిగుడ్లు మాత్రమే అంగన్‌వాడికేంద్రాలకు సరఫరాచేసే విధంగా పిడి, సిడిపిఒ, అంగన్‌వాడి కార్యకర్తలు చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ఎంతటివారినైనా ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు.