ఆంధ్రప్రదేశ్‌

కార్మిక సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 1: కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కార్మిక దినోత్సవం సందర్భంగా మీడియాతో సోమవారం మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. అసంఘటిత కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం చంద్రన్న బీమా పథకాన్ని తీసుకువచ్చామని తెలిపారు. దీని ద్వారా దాదాపు కోటిన్నర అసంఘటిత కార్మికులకు ఐదు లక్షల రూపాయల మేర బీమా వర్తిస్తోందన్నారు. ఎన్నో కార్మిక కుటుంబాలకు చంద్రన్న బీమా వెన్నుదన్నుగా నిలిచిందని గుర్తు చేశారు. కార్మికుల శ్రమను దోపిడీ చేసే వారిని ఉపేక్షించమని, శ్రమకు తగ్గవేతనం, కార్మికుల హక్కులు కాపాడటంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని వివరించారు. కార్మికులు ఏ రంగంలో ఉన్నా, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. యాజమాన్యాలు కేవలం లాభాల గురించి ఆలోచించకుండా కార్మికుల సంక్షేమానికి కూడా పెద్దపీట వేయాలని పిలుపునిచ్చారు.