ఆంధ్రప్రదేశ్‌

ఏర్పేడు ఘటనలో నిందితుల లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 1: ఏర్పేడు వద్ద గత నెల 21న జరిగిన దుర్ఘటనలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవిందవరం సర్పంచ్ చిరంజీవులు నాయుడుతోపాటు మరో ఏడుగురు సోమవారం పోలీసులకు లొంగిపోయారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇసుక మాఫియా అగడాలపై ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వచ్చిన మునగలపాల్యెం గ్రామస్థులు 16 మంది మృతి చెందగా 26 మంది గాయపడ్డ సంఘటన గత నెల 21న జరిగిన విషయం పాఠకులకు విదితమే. ఈ ఘటనకు బాధ్యులుగా పేరం ధనంజయులు నాయుడుతోపాటు ఆయన సోదరుడు చిరంజీవులు నాయుడు, మరో ఆరుగురు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సంఘటనపై సిఎం చంద్రబాబు నాయుడు స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ధనంజయులు నాయుడు, చిరంజీవులు నాయుడుని టిడిపి నుంచి సస్పెండ్ చేశారు. వివాదం జరుగుతున్న సమయంలోనే ధనంజయులు నాయుడు అమెరికాకు, మిగిలిన నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇక చట్టం నుంచి తప్పించుకోలేమని భావించిన నిందితులు చిరంజీవులు నాయుడు, పేరం సుబ్రమణ్యం నాయుడు, పేరం భాస్కర్ నాయుడు, పేరం వెంకట్రామనాయుడు, దొద్దాల మునిరత్నం నాయుడు, దొద్దాల మహేష్‌నాయుడు, రావూరు సతీష్ నాయుడు, ఆలం మధు సోమవారం పోలీసులకు లొంగిపోయారు. అయితే వీరంతా ముందస్తు బెయిల్‌కోసం శ్రీకాళహస్తి కోర్టు వద్ద ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.