ఆంధ్రప్రదేశ్‌

రైతులను రెచ్చగొట్టేందుకే జగన్ దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 1: పసుపు, మిర్చి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఓ పక్క పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పరిహారం చెల్లిస్తుంటే మరోపక్క వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దొంగదీక్షలు చేస్తూ రైతులను రెచ్చగొడుతున్నారని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి విమర్శించారు. సోమవారం కడపలో విలేఖరులతో మాట్లాడుతూ సిమెంటు ధర పెంపుపై జగన్ దీక్ష చేస్తే బాగుంటుందన్నారు. తన సిమెంట్ ఫ్యాక్టరీలో తయారవుతున్న సిమెంటును బస్తా రూ.230కు విక్రయించాల్సి ఉండగా ధర పెంచి ఏకంగా రూ.370కు విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. సిమెంట్ ప్రతి ఒక్కరికి అవసరమేనని, సిమెంటు ధర పెరుగుదలపై జగన్ దీక్ష చేపడితే బాగుంటుందని వారు సూచించారు. ప్రజలు తనను ఎక్కడ మరచిపోతారేమోనన్న భయంతో రైతుల పేరిట గుంటూరులో రెండు రోజుల దీక్ష చేపట్టారన్నారు. మిర్చి రైతుకు రూ.1500, పసుపునకు మొదటి క్వాలిటీకి రూ.6,500, రెండవ క్వాలిటికీ రూ.6వేలు చొప్పున చెల్లించడమే గాకుండా ప్రతి రైతుకు రూ.1500 పరిహారం చెల్లిస్తున్నామని వారు స్పష్టం చేశారు.
జగన్ దీక్ష ఎందుకో
నెల్లూరు: ప్రతిపక్ష నేత దీక్ష ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణ ఎద్దేవా చేశారు. సోమవారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 2కోట్ల ఎకరాల్లో వ్యవసాయం జరిగేలా ప్రణాళిక సిద్ధం చేశారని వెల్లడించారు. దేశంలో ఎవరూ చేయని విధంగా రైతు రుణమాఫీని చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబేనన్నారు. వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ ఇస్తున్నామని, గతంలో రైతు పక్షపాతిగా ప్రచారం చేసుకున్న వై ఎస్ రాజశేఖర్‌రెడ్డితో సహా ఏ ముఖ్యమంత్రి 7 గంటల విద్యుత్ ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.