ఆంధ్రప్రదేశ్‌

సూక్ష్మ, బిందు సేద్యానికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 1: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయపరంగా అగ్రస్థానంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో సూక్ష్మ సేద్యం (మైక్రో ఇరిగేషన్), బిందు సేద్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. వ్యవసాయ ఉద్యానవన పంటల అభివృద్ధి, అధిక ఉత్పత్తి సాధన కోసం 2003 నవంబరులో మైక్రో ఇరిగేషన్ పథకాన్ని అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద తూర్పు గోదావరి జిల్లాలో ఇంతవరకు 16,530 మంది రైతులకు 23,424 హెక్టార్లలో సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించడానికి రూ.5524.31 లక్షలు రాయితీగా మంజూరుచేశారు. ఇకపై జిల్లాలో మైక్రో ఇరిగేషన్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంచేసింది. 2017-18 సంవత్సరానికి జిల్లాలో వేలాది హెక్టార్లలో సూక్ష్మ సేద్యాన్ని అమలుచేయడానికి అధికార యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధంచేసి, ప్రభుత్వానికి నివేదించింది. జిల్లాలో సారవంతమైన రేగడి నేలలు, తూర్పు, మధ్య డెల్టా ప్రాంతాలు, ఏజన్సీ, తీర ప్రాంత భూములున్నాయి. కొబ్బరి, ఆయిల్ పాం, కర్ర పెండలం, చెరకు, పత్తి, మామిడి, జీడి మామిడి వంటి తోటలు ఇక్కడ ప్రసిద్ధి. జిల్లా అంతటా పెద్దఎత్తున కూర గాయల సాగు జరుగుతోంది. కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకో, అరటి సాగులో ఉన్నాయి. జిల్లాలో 0.10 లక్షల హెక్టార్లలో చెరకు సాగవుతోంది. కొబ్బరి తోటలు 0.50 లక్షల హెక్టార్లు, ఆయిల్ పాం 0.2 లక్షల హెక్టార్లు, మామిడి 0.15 లక్షల హెక్టార్లు, జీడి మామిడి 0.33 లక్షల హెక్టార్లు, కూరగాయలు 0.12 లక్షల హెక్టార్లలో సాగవుతున్నాయి. అయితే సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచడానికి, నీటి సమస్యను ఎదుర్కోవడానికి సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
అలాగే బిందు, తుంపర సేద్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ప్రకటించాయి. ప్రస్తుతం బిందు, తుంపర సేద్యం లక్ష్యం 3వేల హెక్టార్లు కాగా 2514.42 హెక్టార్ల మేర ప్రగతి కనిపిస్తోంది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 5 ఎకరాల మెట్ట్భూమి వరకు రెండు లక్షల రూపాయలకు మించకుండా బిందు సేద్యం పరికరాలను నూరు శాతం రాయితీపై ప్రభుత్వం అందజేస్తోంది. సన్న చిన్నకారు రైతులకు మెట్ట భూమి 5 ఎకరాల వరకు రెండు లక్షలకు మించకుండా బిందు సేద్యం పరికరాలకు ప్రభుత్వం 90 శాతం రాయితీ ప్రకటించింది. 5 ఎకరాల నుండి పదెకరాల మెట్ట భూమి కలిగిన వారికి 2 లక్షల 80వేల రూపాయలు మించకుండా 70 శాతం రాయితీపై బిందు సేద్యం పరికరాలను ప్రభుత్వం సమకూరుస్తోంది. 10 ఎకరాలకు పైగా మెట్ట భూమి కలిగివున్న పెద్ద రైతులకు వారి గరిష్ఠ భూ పరిమితికి లోబడి నాలుగు లక్షల రూపాయలకు మించకుండా బిందు సేద్యం పరికరాలను 50 శాతం రాయితీపై అందిస్తోంది.