ఆంధ్రప్రదేశ్‌

ఒంగోలు, సింగరాయకొండలో ఆగనున్న రెండు రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), మే 1: దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ మీద నడిచే రైళ్లలో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా కొన్ని హాల్ట్‌లు కల్పిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసిందని చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎం ఉమాశంకర్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెంబరు 22663 చెన్నై- ఎగ్‌మూర్ నుంచి జోద్‌పూర్ వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఒంగోలు స్టేషన్‌లో నిమిషం పాటు ఆగుతుందని తెలిపారు. అంటే ఒంగోలుకు రాత్రి 19.33కు వచ్చి 19.34 నిమిషాలకు బయలుదేరుతుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ట్రైన్ నెంబరు 22664 జోద్‌పూర్ నుంచి చెన్నై- ఎగ్‌మూర్ వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం ఒంగోలులో 11.30కి వచ్చి 11.31కి బయలుదేరుతుంది. అలాగే ట్రైన్ నెంబరు 17209 బెంగుళూరు నుంచి కాకినాడ టౌన్ వెళ్లే శేషాద్రి ఎక్స్‌ప్రెస్ సింగరాయకొండలో రాత్రి 21.27 గంటలకు వచ్చి 21.28 నిమిషాలకు బయలుదేరుతుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ట్రైన్ నెంబరు 17210 శేషాద్రి ఎక్స్‌ప్రెస్ సింగరాయకొండలో అర్ధరాత్రి 01.22 గంటలకు వచ్చి 01.23 గంటలకు బయలుదేరుతుంది. ఈ హాల్టులు ఈనెల 5వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ సౌకర్యం ఆరు నెలల పాటు కొనసాగించిన అనంతరం తరువాత ప్రయాణికుల సంఖ్యను బట్టి సమీక్షిస్తారు.