ఆంధ్రప్రదేశ్‌

‘పోలవరం’లో ప్రపంచ స్థాయి టెక్నాలజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 25: ప్రపంచ స్థాయి టెక్నాలజీతో ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. బడ్జెట్ కేటాయింపుల నేపథ్యంలో పోలవరం పనులు ఊపందుకున్నాయి. హెడ్‌వర్క్స్ అన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధానంగా డయాఫ్రమ్ వాల్ పరీక్షలు పూర్తయ్యాయి. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఆధునిక టెక్నాలజీ కలిగిన విదేశీ భారీ యంత్ర సామాగ్రితో పనులు చకచకగా సాగుతున్నాయి. క్రమేణా ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతున్నాయి. గత వారం రోజులుగా పనులు మరింత ఊపందుకున్నాయి. హెడ్ వర్క్స్ జరుగుతున్న ప్రాంతంలో నిత్యం వేలాది భారీ లారీలు మట్టి పనుల్లో నిమగ్నమయ్యాయి. ఎల్ అండ్ టి, ట్రాన్‌స్ట్రాయ్ కంపెనీల వాహనాలు మట్టి పనులు నిర్వహిస్తున్నాయి. ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి పెద్దఎత్తున యంత్రాలు హెడ్‌వర్క్స్ ప్రాంతానికి చేరుకున్నాయి. గత వారం రోజులుగా ఇసుక మట్టం వైబ్రేఫిటేషన్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి భూకంప ప్రకంపనలు, తదితర వాటిని తట్టుకునే విధంగా అవసరమైన చర్యలకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సన్నద్ధమవుతున్నారు. పోలవరం ప్రాజెక్టులో ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చాలా కీలకమైనది కావడంతో అన్నిరకాల పరీక్షలు నిర్వహించి, పెద్దఎత్తున సాంకేతికతతో పనులు చేపట్టారు. మట్టి నమూనా పరీక్షలు, భూగర్భ పరీక్షలన్నీ అత్యాధునిక ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిర్వహిస్తున్నారు. 1.75 మీటర్ల డ్యామ్ నిర్మాణం అమెరికా, జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతోంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ట్రాన్‌స్ట్రాయ్ కంపెనీ జర్మనీకి చెందిన బావర్ కంపెనీతో చేపట్టింది. రెండేళ్ల కాలంలో పూర్తయ్యే లక్ష్యంతో పనులు మొదలయ్యాయి. మరోవైపు శాడిల్ డ్యామ్, ట్విన్ టనె్నల్ పనులు జోరందుకున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్న యంత్రాలతో హెడ్‌వర్క్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.