ఆంధ్రప్రదేశ్‌

కియాతో లాభాలు ‘అనంతం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 1: కియా మోటార్స్ కార్ల పరిశ్రమతో కరవు జిల్లా అనంతపురం రూపురేఖలే పూర్తిగా మారిపోనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోస్యం చెప్పారు. ఆటోమోటివ్ రంగంలో అతి పెద్ద సంస్థగా ఉన్న కియా మోటార్స్ ఏపీకి రావడం ఒక చరిత్రాత్మక అంశంగా పేర్కొన్నారు. 13వేల కోట్ల పెట్టుబడి, 11వేల మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయని చెప్పారు. స్థానిక యువతకు 90 శాతం ప్రాధాన్యం ఉంటుందని సోమవారం సాయంత్రం తనను అభినందించడానికి పెద్దఎత్తున వచ్చిన పెనుకొండ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. ఎమ్మెల్యే బికె పార్థసారధి నేతృత్వంలో ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు, ఇతర ప్రజాప్రతినిధులు కియా కంపెనీ తమ జిల్లాకు రావడానికి కృషిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును పూలమాలతో సత్కరించారు. అనంతపురం జిల్లాకు నీటి సౌకర్యం కల్పిస్తే మరిన్ని పరిశ్రమలు వస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిచేయడానికి కృతనిశ్చయంతో ఉన్నదని చెప్పారు. పెనుకొండ, మడకశిర తదితర ప్రాంతాల్లో తాగు, సాగునీటికి కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. సమీపంలో బెంగళూరు నగరం ఉండటమే అనంతపురం జిల్లాకు వరమని ముఖ్యమంత్రి అన్నారు. అనంతపురం నుంచి కర్నూలు, కడప జిల్లాను తాకుతూ రాజధాని అమరావతికి వేస్తున్న ఎక్స్‌ప్రెస్ వేను కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేగా గుర్తించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కార్మిక, యాజమాన్యాల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఎప్పటికీ నిలిచి ఉంటుందని, అందుకే ఇక్కడ పరిశ్రమల స్థాపనకు పెద్దఎత్తున పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని అన్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఫోక్స్‌వ్యాగన్ పరిశ్రమ కోసం ఎంతగానో శ్రమించి తీసుకువస్తే తన తరువాత వచ్చిన పాలకులు వాళ్ల అసమర్థ, అవినీతి చర్యలతో దాన్ని పొరుగు రాష్ట్రాలకు పంపించేశారని సిఎం గుర్తుచేశారు. అనంతపురం జిల్లాకు వస్తున్న తొలి భారీ పరిశ్రమకు ప్రజానీకం సహకరించాలని కోరారు. ఎక్కడా లేనంత అభివృద్ధి అనంతపురం జిల్లాలో జరగబోతోందన్నారు.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తున్న అనంతపురం జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే బికె పార్థసారధి