ఆంధ్రప్రదేశ్‌

మహానాడు వేదిక ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 1: రెండు సంవత్సరాలకోసారి టిడిపి మే 27,28,29 తేదీల్లో నిర్వహించుకునే పండుగ మహానాడు ఎక్కడ నిర్వహించాలన్న దానిపై స్పష్టత చేకూరింది. ఈ సారి టిడిపి మహానాడు విశాఖలో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించినప్పటికీ వేదిక ఎంపిక విషయంలో తర్జన భర్జన కొనసాగుతూ వచ్చింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళావెంకటరావు, తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ నేతృత్వంలో టిడిపి జిల్లా సమన్వయ కమిటీ విశాఖలో సోమవారం సమావేశమై మహానాడు వేదికను ఖరారు చేశారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో మహానాడు నిర్వహించాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది. ఇదే విషయాన్ని టిడిపి జాతీయ అధ్యక్షడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించిన అనంతరం ఎయు ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌ను ఖరారు చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్న ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా ఎయు ఇంజనీరింగ్ కళాశాల మైదానం వేదికగా టిడిపి మహానాడు నిర్వహించేందుకే మొగ్గుచూపింది. తొలుత విశాఖలో నాలుగైదు స్థలాలను పరిశీలించిన సమన్వయ కమిటీ చివరకు ఎయు గ్రౌండ్స్‌లో నిర్వహించడమే మేలని భావించి నిర్ణయం తీసుకుంది. మహానాడు నిర్వహణకు సంబంధించి రాష్ట్ర పార్టీ పర్యవేక్షణలో 15 కమిటీలను నియమించాలని నిర్ణయించారు. వీటిలో కీలక కమిటీలకు సీనియర్ మంత్రులు సారథ్యం వహిస్తారు. మిగిలిన కమిటీలకు పార్టీ ఎమ్మెల్యేలు నేతృత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు విలేఖరులతో మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా టిడిపి మహానాడు ఎయు ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో నిర్వహించాలని నిర్ణయించామని ప్రకటించారు. విద్యా సంస్థల్లో రాజకీయ పార్టీల సమావేశాలు జరగకూడదని, టిడిపి ప్రభుత్వ హయాంలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారని పార్టీ అధ్యక్షుని దృష్టికి తీసుకురాగా, కొన్ని సౌలభ్యాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో నిజాం కళాశాల మైదానంలో రాజకీయ పార్టీల సభలు జరుగుతున్నాయి కదా! అదే వెసులుబాటు ఇక్కడ కూడా వర్తిస్తుందన్నారు. గతంలో కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఎయు గ్రౌండ్స్‌ను రాజకీయ సభలకు వాడుకున్న విషయాన్ని ప్రస్తావించారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల పార్టీలో ద్వితీయ స్థాయి కేడర్ నిరాశలో ఉందని, మహానాడు లోగా వీటిని భర్తీ చేస్తామని గతంలో ఇచ్చిన హామీని ఏ విధంగా నిలబెట్టుకుంటారని ప్రశ్నించగా, 95 శాతం నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశామని, మిగిలిని పోస్టులు మహానాడు అనంతరం భర్తీ చేస్తామన్నారు. ఎస్‌టి, మైనార్టీలకు మంత్రివర్గంలో చోటుదక్కకపోవడంపై ఆయన వివరణనిస్తూ మైనార్టీ వర్గాల సంక్షేమానికి టిడిపి కట్టుబడి ఉందని, అందుకే ఆశాఖను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పర్యవేక్షిస్తున్నారన్నారు. సమావేశంలో మంత్రులు సిహెచ్ అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎంపి ఎం శ్రీనివాసరావు, పార్టీ ఇన్‌ఛార్జి టిడి జనార్దన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.