ఆంధ్రప్రదేశ్‌

కూల్‌కూల్‌గా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 1: ప్రస్తుత వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపధ్యంలో రాష్టవ్య్రాప్తంగా సిటీ, పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఉపశమనం కల్గించే దిశగా ఎపిఎస్‌ఆర్‌టిసి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ ఎం మాలకొండయ్యతో ఆర్‌టిసి చరిత్రలోనే తొలిసారిగా వినూత్న చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పగటి సమయంలో ప్రయాణించే ప్రయాణీలకు ఎండ వేడిమి నుంచి ఊరట కలిగేలా బస్సు కిటికీలకు కూలింగ్ మ్యాట్‌లను అమర్చాలంటూ మాలకొండయ్య సోమవారం 13 జిల్లాల ఆర్‌టిసి రీజనల్ మేనేజర్లకు ఆదేశాలు జారీచేసారు. ఆదేశాలు జారీ అయిన మరో క్షణంలోనే కృష్ణా రీజనల్ మేనేజర్ పిన్నమనేని వెంకట రామారావు ప్రయోగాత్మకంగా ఇబ్రహీంపట్నం డిపోలో ఒక సిటీ ఆర్డినరీ బస్సుకు ఆఘమేఘాలపై కూలింగ్ మ్యాట్‌లను అమర్చారు. డిపో అసిస్టెంట్ ఇంజనీరు భానుప్రసాద్ నేతృత్వంలో డిపో సిబ్బంది తొలుతగా గొల్లపూడి-పోరంకి రూట్‌లో తిరిగే ఒక బస్సుకు వాటర్ కూలింగ్ సిస్టం అమర్చారు. ఆర్టీసీ ఎండి మాలకొండయ్య స్వయంగా పరిశీలించి ఈ సౌకర్యాన్ని కల్పించిన కార్మికులను అభినందించారు.