ఆంధ్రప్రదేశ్‌

టిడిపిలో టిటి ‘్ఢ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 1: తెలుగుదేశం పార్టీలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ వ్యవహారం చిచ్చురేపుతోంది. చైర్మన్ పదవి తనకే ఇవ్వాలని, దానికోసం అవసరమైతే తన ఎంపి పదవికి రాజీనామా చేసేందుకైనా సిద్ధమంటూ నర్సరావుపేట లోక్‌సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు నేరుగా ముఖ్యమంత్రికి రాసిన లేఖ కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా పర్యటనకు ముందుగానే టిటిడి పాలక వర్గాన్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో, చైర్మన్ పదవిపై ఉత్కంఠ మొదలయింది. ఇప్పటికే ఆ పదవిని తనకు సన్నిహితుడైన రాజమండ్రి ఎంపి, సినీ నటుడు మురళీమోహన్‌కు ఇవ్వాలని బాబు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో రాయపాటి రాశారని చెబుతున్న లేఖ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. రాయపాటి జీవిత లక్ష్యంగా మారిన టిటిడి చైర్మన్ ఆయనకు ఇప్పటివరకూ అందనిద్రాక్షగానే మారింది. యుపిఏ హయాంలో అనేకసార్లు ఆ పదవికి కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఒకసారి సుబ్బరామిరెడ్డి, మరోసారి కనుమూరి బాపిరాజు చైర్మన్ పదవి ఎగురేసుకుని వెళ్లారు. రాయపాటి, తెలుగుదేశం పార్టీలోనైనా తన కల సాకారం చేసుకోవాలని భావించి, ఆ పార్టీలో చేరారు. చేరేముందు తనకు టిటిడి చైర్మన్ పదవి ఇవ్వాలన్న షరతు మీదే పార్టీ తీర్థం తీసుకున్నారని, అందుకు అప్పట్లో బాబు కూడా అంగీకరించారని ఆయన వర్గీయులు గుర్తు చేస్తున్నారు. చదలవాడ కృష్ణమూర్తి చైర్మన్‌గా ఉన్న టిటిడి పాలకవర్గం పదవీకాలం ఇటీవలే పూర్తయింది. దీనితో తన అమెరికా పర్యటనకు ముందే టిటిడి పాలకవర్గాన్ని ప్రకటించేందుకు బాబు కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో, ఆయనకు రాయపాటి రాసిన లేఖ చర్చనీయాంశమయింది. జీవితకాల కోరికయిన టిడిడి చైర్మన్ పదవి తనకే ఇవ్వాలని, తనకు వయసు మీదపడినందున ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగలేనని, కాబట్టి తన పరిస్థితి అర్థం చేసుకుని ఆ పదవి ఇవ్వాలని తన లేఖలో కోరినట్లు తెలిసింది. అదే సమయంలో ఒకవేళ తాను ఎంపిగా ఉన్నానన్న కారణమే చైర్మన్ పదవికి అడ్డంకి అని భావిస్తే, నర్సరావుపేట ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సైతం సిద్ధంగానే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే, ఈ లేఖపై రాయపాటి వివరణ కోరగా నేను ఇప్పుడే ఢిల్లీ నుంచి వచ్చా.. ఆసుపత్రిలో అడ్మిట్ చేరాను అని చెప్పారు. అయితే గత పదిరోజుల క్రితమే లేఖ రాశారని ప్రచారం జరుగుతోంది కదా అన్న ప్రశ్నకు నానె్సన్స్ అని కొట్టిపారేశారు.
కాగా గత ఎన్నికల్లోనే పార్టీలో చేరిన రాయపాటి, అప్పుడే టిటిడి చైర్మన్ కోసం పట్టుపట్టడం ఏమిటని పార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అప్పటికీ ఆయన సూచించిన వారందరికీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయిన పార్టీ సీనియర్లు ఎంతోమంది ఉండగా, వారిని కాదని రాయపాటి తనకు ఇవ్వాలని కోరడం అత్యాశే అవుతుందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.