ఆంధ్రప్రదేశ్‌

ఆయేషా తల్లిదండ్రులకు ప్రభుత్వం న్యాయం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయేషామీరా తల్లిదండ్రులకు న్యాయం చేయాలని, ఆయేషా హత్యకేసులో నిర్దోషిగా విడుదలైన సత్యం బాబు కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరులతో మాట్లాడుతూ నిర్భయ కేసులో ఎలాంటి న్యాయం జరిగిందో ఆయేషా కుటుంబానికి అలాంటి న్యాయమే జరగాలని అతడు తెలిపాడు. ఈ కేసులో మొదటి నుంచి తాను నిర్దోషినేనని చెబుతూ వచ్చానని, చివరికి న్యాయమే గెలిచింని చెప్పాడు. ‘నా తల్లి, చెల్లిని చంపేస్తామని పోలీసులు బెదిరించడంతో ఆ నాడు మీడియా ముందు తప్పు చేసినట్టు ఒప్పుకున్నాను. పోలీసులు అన్యాయంగా నన్ను ఆయేషా హత్య కేసులో ఇరికించారు’అని సత్యంబాబు ఆరోపించాడు. ఈ కేసులో ఆయేషా తల్లిదండ్రులు తనకు అండగా నిలిచారని వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని అతడు పేర్కొన్నాడు. అన్యాయంగా కేసులో ఇరికించారని, తన తరఫున వాదించేందుకు అడ్వకేట్‌ను పెట్టుకునే స్తోమత కూడా లేకపోయినా, తన పేదరికాన్ని అర్థం చేసుకుని వాదించిన అడ్వకేట్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. తాను జైలులో ఉండే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని నిర్దోషిగా బయటకు వచ్చానని సత్యంబాబు తెలిపాడు.