ఆంధ్రప్రదేశ్‌

గోదావరి జిల్లాల్లో ఈదురు గాలుల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 1: ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వివరాల్లోకి వెళితే... సోమవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా ఉండగా, సాయంత్రానికి ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచాయి. కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై, భారీ వర్షం కురిసింది. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో సుమారు రెండు గంటలపాటు భారీ గాలులు వీయడంతో వృక్షాలు, విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. అనేక చోట్ల విద్యుత్ తీగలపై చెట్లు విరిగిపడడంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల ఇళ్లపై చెట్లు పడటంతో నష్టం వాటిల్లింది. రాజవొమ్మంగి మండలం దూసరపాము గ్రామం సమీపంలో ఆర్‌అండ్‌బి రహదారిపై చెట్టు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజవొమ్మంగి ట్రాన్స్‌కో కార్యాలయం సమీపంలో తాడి చెట్టువిరిగి ఆవుపై పడడంతో అక్కడికక్కడే మరణించింది. ఈదురు గాలులకు మామిడికాయలు నేల రాలాయి. జీడిమామిడి గింజలు పక్వానికి రాకుండానే నేలరాలాయి. సామర్లకోట పట్టణంలో ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో భారీ వృక్షాల కొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడటంతో సుమారు మూడు గంటలకు పైగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చింతలపూడి మండలం యర్రంపల్లి గ్రామంలో పిడుగుపాటుకు ఒక విద్యార్థి మృతి చెందాడు. అతని తల్లి గాయపడింది. తగరం దిలీప్ (14) మొక్కజొన్న తోటలో పనిచేస్తుండగా వర్షం పడటంతో తల్లితో కలిసి చెట్టుకింద తలదాచుకోవడానికి వెళ్లాడు. చెట్టుపై పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.