ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్యే కోటంరెడ్డి గాంధీగిరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, మే 1: నెల్లూరు కార్పొరేషన్‌లో విలీనమైన శివారు గ్రామాలు, కాలనీలలో సమస్యలు తిష్టవేశాయని వాటి పరిష్కారం కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు కమిషనర్ డిల్లీరావుకు ఇచ్చిన 42 గంటల గడువు పూర్తి కావడంతో రూరల్ ఎమ్మెల్యే కమిషనర్ ఛాంబర్ ముందు నిరసన ప్రదర్శనకు దిగారు. వైసీపీ నేతలతో కలిసి గాంధీగిరి ప్రారంభించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి మూడేళ్ళలో 300 సార్లు కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరిగినా, భేషజాలు పక్కన పెట్టి, ఎమ్మెల్యేనన్న మాట సైతం మరిచి ప్రజల కోసం ఫైళ్లు చంకలో పెట్టుకుని అటెండర్ లాగా అధికారులు చుట్టూ తిరిగినా పనులు కాకపోవడంతో ఇక అధికారులతో తాడోపెడో తెల్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి కార్పొరేషన్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి కమిషనర్ కార్యాలయం వద్ద గాంధీగిరి నిరసన చేశారు. కమిషనర్ మంత్రి పర్యటనలో ఉండటంతో ఆయన సాయంత్రం వరకు కార్యాలయం వద్దకు రాలేదు. దీంతో ఎమ్మెల్యే అధికారుల నుండి ఎస్సీ సబ్‌ప్లాన్ పనులు ప్రారంభంలో నిర్థిష్టమైన సమాచారం వచ్చే వరకు కమిషనర్ ఛాంబర్ నుండి వెళ్లే ప్రసక్తే లేదని భీష్మించి కూర్చొన్నారు. దీంతో మధ్యాహ్నం వరకు కమిషనర్ రాకపోవడంతో తన అనుచరులతో కమిషనర్ ఛాంబర్ ముందే భోజనాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు కేటాయింపులు జరిగినా, టెండర్ల ప్రక్రియ పూర్తి అయినా, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టకపోవడం దారుణ మని అధికారుల తీరుపై మండిపడ్డారు. టెండర్లు పూర్తి అయిన 90రోజుల్లో పనులు మొదలు కావాలని సాక్షాత్తు సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాలిచ్చినా మునిసిపల్‌శాఖ మంత్రి నారాయణ తన సొంత జిల్లాలోని కార్పొరేషన్‌లోనే టెండర్ల ప్రక్రియ ముగిసి 200 రోజులు పూర్తి అయిన పనులు మొదలు పెట్టలేదని తెలిపారు. సమస్యలపై పోరాటం కోసం కమిషనర్ కార్యాలయం ఎదుట దీక్షకు దిగిన తనను అరెస్టు చేస్తే పోలీస్ స్టేషన్‌లోనే దీక్షకు దిగుతానని , జైలుకు పంపిస్తే బెయిల్ తీసుకోకుండానే జైలులో కూడా దీక్ష చేపడతానని పేర్కొన్నారు. తాను ప్రజల సహకారంతోనే ఎమ్మెల్యేగా గెలిచానని వారి సమస్యలు పరిష్కరించకుంటే తాను ఎమ్మెల్యేగా ఉండి ఉపయోగం లేదని, ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న తన నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేసేంత వరకు తన పోరాటం ఆగదని తెలిపారు.

చిత్రం..కమిషనర్ ఛాంబర్ ముందు కోటంరెడ్డి నిరసన