ఆంధ్రప్రదేశ్‌

సాగర్ జలాల రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున సాగర్, మే 2: నాగార్జునసాగర్ డ్యాం కుడి కాలువ నీటి విడుదల నిలిపివేతపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం పరస్పరం పోలీస్ స్టేషన్లలో కేసుల నమోదుకు దారితీసింది. తొలుత ఆంధ్ర ఇంజనీర్లు డ్యాం భద్రత విభాగానికి చెందిన ఎస్‌పిఎఫ్ ఆర్‌ఐ సురేష్‌పై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆంధ్ర పరిధిలోని విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై సీరియస్‌గా స్పందించిన తెలంగాణ డ్యాం ఇంజనీర్లు మంగళవారం రాత్రి విజయపురి నార్త్ పోలీస్ స్టేషన్లపై ఆంధ్ర ఇంజనీర్లపై ఫిర్యాదు చేశారు. కుడి కాలువ నీటి నిలిపివేత సందర్భంగా తమ విధులకు ఆటంకం కలిగించారంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు మేరకు కుడి కాలువ ఈఈ జబ్బార్, డిఈ నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, జెఈ కేశవరావు, వెంకటసుబ్బయ్య, ఆపరేటర్లు భాషా, సాంబశివరావు, రమణలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గౌరినాయుడు తెలిపారు. కాగా, స్థానిక డ్యాం ఈఈ వెంకట్‌రెడ్డి, డిఈ విజయ్‌కుమార్‌లు, జెఈ జనార్ధన్‌రావు సాగర్ పోలీస్‌స్టేషన్‌లో మిర్యాలగూడ డిఎస్పీ రాంమోహన్‌రావు, హాలియా సిఐ పార్ధసారధితో సమావేశమైన అనంతరం ఈ ఫిర్యాదు అందించారు. ఈ సందర్భంగా డిఎస్పీ రాంమోహన్‌రావు మాట్లాడుతూ ఈ వివాదం ఇరు రాష్ట్రాల ప్రజల మనోభావాలకు సంబంధించిన సున్నిత విషయమని, దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.