ఆంధ్రప్రదేశ్‌

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మే 2: కుప్పం సిఐ వేధింపుల తాళలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నాకి పాల్పడిన సంఘటన మంగళవారం చిత్తూరులో చోటు చేసుకుంది. కుప్పం పిఎస్‌లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్ నిర్మల చిత్తూరు మహిళా స్టేషన్ సమీపంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం పోలీసు వర్గాల్లో కలకం సృష్టించింది. నిర్మల రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. సిఐగా వున్న రాజశేఖర్ తరుచూ మహిళా కానిస్టేబుళ్ల పట్ల దురుసుగా ప్రవర్తించడం, దుర్భాషలాడం తోపాటు పలురకాలుగా వేధింపులకు గురి చేస్తుండడంతో దీన్ని జీర్ణించుకోలేని కొందరు మహిళా కానిస్టేబుళ్ళు ఈవిషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. అయినా వారి నుంచి స్పందన లేక పోవడంతో ఇటీవల ఈవిషయాన్ని పోలీసు శాఖకు చెందిన వాట్స్‌ప్ ద్వారా తెలియజేశారు. దీంతో సిఐ వేదింపులు తారస్థాయికి చేరుకున్నాయి. మంగళవారం తమ సమస్యను చిత్తూరు మహిళా డిఎస్పీ గిరిధర్‌కు తెలియజేయడానికి రావడంతో సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని, చిన్న విషయాన్ని పోలీసు వాట్స్‌ప్ ద్వారా ఉన్నతాధికారులకు తెలపడం మంచిది కాదని వారించారు. దీన్ని జీర్ణించుకోలుని నిర్మల స్టేషన్ బయట నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది, ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. సిఐ రాజశేఖర్ స్టేషన్‌లో మహిళా సిబ్బంది పట్ల చాల దురుసుగా ప్రవర్తిస్తున్నాడని అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్‌లో తెలిపింది. చిత్తూరు పోలీసులు నిర్మల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకొని ఆమెవద్ద స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు.