ఆంధ్రప్రదేశ్‌

ప్రజలకు ఒక రేటు..ప్రభుత్వానికి మరొక రేటా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 2: రాష్ట్రంలో సిమెంట్ ధరలను మంత్రుల బృందమే దగ్గరుండి పెంచిందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అకారణంగా సిమెంట్ ధరలను పెంచడాన్ని విపక్షాలు తీవ్రంగా దుయ్యబడుతున్నాయి. నిర్మాణ రంగ సంస్థలు ఈ ధరల పెంపును నిరసిస్తూ, సిమెంట్ కొనుగోళ్లను నిలిపివేయాలన్న ఆలోచన చేస్తున్నాయి. అసెంబ్లీలో బిజెపి ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు ధరల పెంపుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. సిమెంట్ కంపెనీ యాజమాన్యాలకు ప్రభుత్వం కొమ్ము కాసి, రాష్ట్ర ప్రజలపై నెలకు 350 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపిందని అన్నారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ను సిమెంట్ కంపెనీల యజమానులు ఏవిధంగా మోసగించారో వివరించారు. రాష్ట్రంలో బస్తా సిమెంట్ ధరను 310 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, ప్రభుత్వ చేపట్టే నిర్మాణ పనులకు మాత్రం బస్తా 240 నుంచి 250 రూపాయలకు ఇవ్వాలని మంత్రుల కమిటీ చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వానికి ఒక రేటు, ప్రజలకు ఇంకో రేటేంటని జనం ప్రశ్నిస్తున్నారు. దీనిపై బిజెపి ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ మార్చి 28న ఓపి సిమెంట్ బస్తా 310 రూపాయల చొప్పున ఇన్వాయిస్ రాసి సరుకును డీలర్లకు పంపించారు. డీలర్లను మాత్రం 270 రూపాయలకు మాత్రమే విక్రయించమని ఆయా సిమెంట్ కంపెనీలు ఆదేశించాయని చెప్పారు. మార్చి 31 తేదీన స్లాగ్ సిమెంట్ బస్తా 305 రూపాయల చొప్పన ఇన్‌వాయిస్ రాసి, దాన్ని 245 రూపాయలకు విక్రయించాల్సిందిగా డీలర్లకు చెప్పారు. ఎక్కువ ధరకు డీలర్లకు సరఫరా చేసి, తక్కువ ధరకు జనానికి విక్రయించమని సిమెంట్ కంపెనీల యాజమాన్యాలు ఏవిధంగా కోరాయన్న అనుమానం అందరికీ వస్తుంది. అయితే, ఇన్‌వాయిస్‌లో పేర్కొన్న ధరకు, డీలరు బహిరంగ మార్కెట్‌లో విక్రయించిన ధరకు మధ్య ఇంకో రేటు ఉంటుందని విష్ణుకుమార్ రాజు చెప్పారు. ఈ రేటు డీలర్లకు, సిమెంట్ కంపెనీల యాజమాన్యాలకు మాత్రమే తెలుస్తుందని ఆయన చెప్పారు. ఈ కనిపించని రేటు ప్రకారం వచ్చిన మొత్తాన్ని సిమెంట్ యాజమాన్యాలు, డీలర్లకు క్రెడిట్ నోటుగా ఇస్తారని, ఆ తరువాత వారి ఖాతాల్లోకి జమ చేస్తారని విష్ణుకుమార్ రాజు చెప్పారు. ఇది ఒక పెద్ద కుంభకోణమని ఆయన అన్నారు. దీనివలన రాష్ట్ర ప్రజలపై నెలకు 350 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని ఆయన తెలియచేశారు. ఒక విధంగా ఇది సిమెంట్ కంపెనీల దోపిడి అని ఆయన అన్నారు. సిమెంట్ ధరల పెంపుపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుకుకు లేఖ రాసినా ప్రయోజనం కనిపించలేదని అన్నారు.
‘ఆ భారం ప్రజలపైనే వేస్తారు కదా!’
ఇంకో ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే, సిమెంట్ ధరల పెంపుపై మంత్రుల బృందం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ వైఖరిని నిర్మాణ సంస్థలు వ్యతిరేకించాయి. ఇదే సమయంలో పెరిగిన భారాన్ని బిల్డర్లు ఎలాగూ ప్రజలపైనే వేస్తారు కదా! పెంపు వారికేంటి ఇబ్బంది అన్న చర్చ జరిగినట్టు తెలిసింది. దీనిపై ఓ బిల్డరు మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన సిమెంట్ ధర వలన ఎస్‌ఎఫ్‌టికి 50 రూపాయల చొప్పున పెంచాల్సి వస్తుందని అన్నారు.