ఆంధ్రప్రదేశ్‌

మూడు రోజుల్లో ఉద్యోగులకు పూర్తి స్థాయ హెల్త్‌కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 2: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌కార్డులపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించి రెండు, మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని, ఈ విషయమై ఉద్యోగులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేటు ఆసుపత్రులు హెల్త్‌స్కీమును (ఇహెచ్‌ఎస్) నిలిపివేస్తున్నట్లు ఇటీవల వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన వివిధ జిల్లాల ఎన్జీవో నేతలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంగళవారం సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్యను కలిసి ఉద్యోగుల్లో ఉన్న ఆందోళనను వివరించారు. అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ మాలకొండయ్య మాట్లాడుతూ ఉద్యోగులకు హెల్త్‌కార్డులపై వైద్య సేవలకు ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలు పెంచాలని ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు కోరారన్నారు. దీనిపై ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపి ధరల నిర్ధారణపై దాదాపు ఒక అంగీకారానికి వచ్చామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సమక్షంలో సమావేశాన్ని నిర్వహించి తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉందన్నారు. మంగళవారం కేబినెట్ సమావేశం వుండటంతో సమావేశం నిర్వహించలేక పోయామన్నారు. రెండు రోజుల్లో ఆరోగ్య శాఖ మంత్రి, ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని, అవసరమైతే ఉద్యోగ సంఘ ప్రతినిధులను సమావేశానికి ఆహ్వానించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో ఆరోగ్య సేవలను అందించాలన్నదే తమ లక్ష్యమని పూనం మాలకొండయ్య వివరించినట్లు ఎన్జీవో సంఘ నేత అశోక్‌బాబు తెలిపారు. ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసిన వారిలో ఎన్జీవో అసోసియేన్ జనరల్ సెక్రటరీ డి.చంద్రశేఖర్ రెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు ఉన్నారు.