ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదాలపై ‘పోలీసు’ కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 2: రోడ్డు ప్రమాదాలపై యుద్ధానికి పోలీసుశాఖ సిద్ధమైంది. ఈమేరకు కార్యాచరణ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో అడుగడుగునా తరచూ చోటు చేసుకుంటున్న ఘోర రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుశాఖ పరంగా చేపట్టాల్సిన చర్యలను రూపొందించిన మీదట ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఇప్పటికే ఈదిశగా కసరత్తు చేసిన డిజిపి ఈమేరకు బుధవారం రాష్ట్రంలోని 13 జిల్లాల ఎస్పీ, డిఐజిలు, ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు లారీ ప్రమాద ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఇక ప్రమాదాలకు చెక్ పెట్టాలని పలు శాఖలను ఆదేశించింది. ఏర్పేడు ఘటనతోపాటు కృష్ణాజిల్లాలో జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం, అదేవిధంగా ఇటీవల పలుచోట్ల బసు దగ్ధం ఘటనల నేపధ్యంలో ఆర్ అండ్ బి, పోలీసు, రవాణా శాఖలు సంయుక్తంగా రంగంలోకి దిగి కనీసం ప్రమాదాల స్థాయిని దాదాపుగా తగ్గించేందుకు కసరత్తు ఆరంభించింది. దీనిలో భాగంగా ఇటీవలే రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప, రవాణాశాఖామంత్రి అచ్చెన్నాయుడు ఈ మూడు శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించి చర్చించారు. సమావేశం సారాంశంతో ప్రమాదాల నివారణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు రంగంలోకి దిగిన నండూరి సాంబశివరావు ఇప్పటికే నివేదికను ఓ కొలిక్కి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని జాతీయ రహదారులు, ఇతర ప్రధాన మార్గాల్లో రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ‘బ్లాక్ స్పాట్’లను గుర్తించడం జరిగింది. అదేవిధంగా మలుపులు ఉన్న ప్రదేశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ ప్రమాదాలకు కారణాలు తేల్చారు. సిసి కెమేరాలు, డ్రోన్లు, ఇతర సాంకేతిక పరిఙ్ఞనాన్ని వినియోగించుకుంటూ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రహదారుల స్థితిగతులు, వాహనాల ఫిట్‌నెస్, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి అంశాలు ప్రమాదాలకు కారణాలుగా తెలుస్తోంది. దీంతో డ్రంకన్ డ్రైవ్‌ను పూర్తిగా నియంత్రించేందుకు నిరంతర తనిఖీలు, టోల్‌గేట్లు వద్ద ‘బ్రీత్ ఎనలైజర్లు’ ఏర్పాటు వంటి చర్యలు పక్కాగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇక ఆర్ అండ్ బి సహకారంతో రహదారుల మరమత్తులు, ఇతర ప్రమాద జోన్ల బోర్డులు ఏర్పాటు వంటి చర్యలు షురూ చేయాలని నివేదికలో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు రవాణా శాఖ, ఆర్ అండ్ బి, ఎక్సైజ్, పోలీసుశాఖలతో సమన్వయం చేసుకుంటూ పూర్తిస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేసేందుకు డిజిపి పోలీసు ఉన్నతాధికారులతో చర్చిస్తారు. సమీక్ష అనంతరం నివేదిక ప్రభుత్వానికి సమర్పించి ఇక రోడ్డెక్కి తనిఖీలు షురూ చేయనున్నారు.