ఆంధ్రప్రదేశ్‌

విశ్వనాథ్, బాహుబలికి కేబినెట్ అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 2: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన దర్శకుడు కె.విశ్వనాథ్, భారతీయ చలనచిత్ర పరిశ్రమను మలుపుతిప్పిన బాహుబలి చిత్ర బృందాన్ని మంత్రివర్గం అభినందించింది. చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు కళాతపస్వి కె.విశ్వనాథ్ ఎంపిక కావటం పట్ల మంత్రిమండలి హర్షం వ్యక్తం చేస్తోంది. వారి సినిమాలలో తెలుగుతనం, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడతాయని కొనియాడారు. వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున అభినందనలు తెలియచేసింది. 90వ దశకంలోనే ఒక తెలుగు సినిమాను ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యేలా రూపొందించిన ఘనత కె.విశ్వనాథ్‌కే దక్కిందని కొనియాడారు. సినీ ప్రపంచంలో అడుగుపెట్టే భావితరాలకు కె.విశ్వనాథ్ స్పూర్తిగా, మార్గదర్శిగా తప్పక నిలుస్తారని ప్రశంసించింది.
బాహుబలి చిత్రబృందానికి అభినందన
ఇటీవల ఘనవిజయం సాధించిన చలనచిత్రం ‘బాహుబలి’ చిత్ర బృందానికి ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి అభినందనలు తెలియచేసింది. ప్రపంచవ్యాప్తంగా 5 భాషలలో విడుదలై చరిత్ర సృష్టించిన ఈ చిత్రం భారతీయ చలనచిత్ర సత్తాని ప్రపంచానికి చాటిందని, తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిందని ప్రశంసించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలను పొందిన చిత్ర దర్శక, నిర్మాతలను, నటీనటులను, సాంకేతిక నిపుణులను మంత్రిమండలి అభినందించింది. తెలుగువారి చిత్ర నిర్మాణ ప్రతిభా పాటవాన్ని విశ్వానికి చాటిచెప్పి మన కీర్తి ప్రతిష్టలను దశదిశలా వ్యాపింపచేసిన చిత్ర దర్శకుడు ఎస్‌ఎస్ రాజవౌళి ఈ చిత్ర నిర్మాణంలో ఐదేళ్లు అహోరాత్రులు శ్రమించి అద్భుతమైన కళాఖండాన్ని అందించినందుకు తెలుగువారు గర్విస్తున్నారని మంత్రి మండలి కీర్తించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా వారిని ప్రశంసించారు.