ఆంధ్రప్రదేశ్‌

తహశీల్దార్ మేజిస్ట్రేట్ అధికారాలు కత్తిరింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 2: కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం క్రమశిక్షణా రాహిత్యంపై కనె్నర్ర చేశారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై మంగళవారం ఆయన విజయవాడ నుండి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్ష జరుగుతున్న సమయంలో మచిలీపట్నం తహశీల్దార్ బి నారదముని, ఎంపిడివో జివి సూర్యనారాయణ నవ్వటంతో కలెక్టర్ ఆగ్రహించారు. నేను సీరియస్‌గా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తుంటే మీరు ఎందుకు నవ్వుతున్నారంటూ ప్రశ్నించారు. తహశీల్దార్‌కు ఉన్న మేజిస్ట్రేట్ పవర్స్ కత్తిరిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఎంపిడివో సూర్యనారాయణకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జెడ్పీ ఇన్‌చార్జ్ సిఇఓ కెవివి సత్యనారాయణను ఆదేశించారు.