ఆంధ్రప్రదేశ్‌

సివిల్స్ అభ్యర్థులకు నిలిచిన స్టయిఫండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పాతబస్తీ), మే 2: కాపు కార్పొరేషన్ ద్వారా సివిల్ సర్వీసెస్ పరీక్షలకు కోచింగ్ తీసుకునేందుకు ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులకు నెలవారీ ఇస్తున్న రూ. 10వేల స్టయిఫండ్‌ను ఏప్రిల్ నుంచి నిలిపివేయడంతో తమ చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సివిల్స్ కోచింగ్‌కు సరైన విద్యా సంస్థలు లేవన్న అభిప్రాయంతో గత ఏడాది జూలై నుంచి ఇతర రాష్ట్రాల్లో సివిల్స్ కోచింగ్ కోసం వెళ్లిన విద్యార్థినీ విద్యార్థులకు అవసరమైన వసతి, భోజనం, బుక్స్, మెటీరియల్ తదితరాల కోసం కాపు కార్పొరేషన్ నుంచి నెలవారీగా రూ. 10వేలు చొప్పున స్టయిఫండ్ అందజేస్తున్నారు. ఈ కోచింగ్ కోసం కాపు కార్పొరేషన్ తరపున 500 మంది విద్యార్థినీ విద్యార్థులను ఎంపిక చేసి ఢిల్లీ, బెంగుళూరు, కేరళ, హైదరాబాద్, తదితర నగరాల్లోని ఐఎఎస్ కోచింగ్ అకాడమీల్లో ఫీజు కట్టి చేర్పించి, 9 నెలల పాటు నెలకు రూ. 10వేల చొప్పున స్టయిఫండ్ ఇస్తున్నారు. అయితే కాపు కార్పొరేషన్ అధికారులు ముందుగానే కేవలం 9 నెలల పాటు మాత్రమే స్టయిఫండ్ ఇస్తామని ప్రకటించారు. దాని ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌తో స్టయిఫండ్ ఇవ్వడం నిలిపివేశారు. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు జూలై 18వ తేదీన జరుగుతాయని యుపిఎస్సీ ప్రకటించింది. అయితే కాపు కార్పొరేషన్ నుంచి ఏప్రిల్ నెలతోనే స్టయిఫండ్ ఆగిపోవడంతో ఈ మే, జూన్ నెలలకు సంబంధించి స్టయిఫండ్ రాకపోతే తాము ఎలా కోచింగ్ తీసుకోగలమని, తమకు స్టయిఫండ్ తప్పనిసరి అని పలువురు విద్యార్థినీ విద్యార్థులు వాపోతున్నారు. సివిల్ సర్వీస్ పరీక్షలు రాసేందుకు శిక్షణ తీసుకుంటున్న వారిలో చాలా మంది పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులే ఉన్నారు. కాపు కార్పొరేషన్ నెలవారీ ఇస్తామంటున్న రూ. 10వేల స్టయిఫండ్‌తో వీరు ఎలాగోలా తమ కోచింగ్‌ను నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు స్టయిఫండ్ అర్ధంతరంగా నిలిచిపోతే హాస్టల్ రూంల ఖర్చులు, భోజనాల ఖర్చులు, పుస్తకాల ఖర్చులు భరించలేక చాలా మంది కోచింగ్ తీసుకోవడాన్ని ఆపివేసి ఇళ్లకు వచ్చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన సివిల్స్ కోచింగ్‌కు వీరిని పంపించిన కాపు కార్పొరేషన్ ఇప్పుడు కోచింగ్ చివరిలో ఇలా అర్ధంతరంగా వారికి స్టయిఫండ్ నిలిపివేస్తే ఎలాగని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, కాపు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ అమరేంద్ర కుమార్‌లు ఆలోచించాలని కోరుతున్నారు.