ఆంధ్రప్రదేశ్‌

‘ఆహారశుద్ధి’తో ఉపాధికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 2: నవ్యాంధ్రప్రదేశ్‌లో ఆహార శుద్ధి పరిశ్రమల (్ఫడ్ ప్రాసెసింగ్) అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ క్రమంలో పలు కంపెనీలకు సూత్రప్రాయంగా మంజూరు చేసిన గ్రాంటు ధ్రువీకరణ పత్రాలను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి మంగళవారం అందజేశారు. ఆహార తయారీ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చిన పలు కంపెనీలతో ఆయన వెలగపూడిలోని తన సచివాలయంలో భేటీ అయ్యారు. ఆహార శుద్ధి పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించవచ్చని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోందని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను అన్ని విధాల ప్రోత్సహిస్తున్నామని, అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. అవీనా మెగా ఫుడ్ పార్క్ ఆంధ్ర ప్రైవేట్ లిమిటెడ్, నార్త్ ఆంధ్ర మెగా ప్రైవేట్ లిమిటెడ్, సేఫ్ ఎన్ ఫ్రెష్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్‌ఆర్‌కె ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల యాజమాన్యాలకు సూత్రప్రాయంగా మంజూరు అయిన గ్రాంటు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. మొత్తం రూ.540 కోట్ల పెట్టుబడితో స్థాపించనున్న పరిశ్రమలతో 9600 మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని మంత్రి అమరనాథ్ రెడ్డి తెలిపారు.