ఆంధ్రప్రదేశ్‌

చిన్న తరహా పరిశ్రమలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 2: సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అమలుచేస్తున్న ఏక గవాక్ష విధానం (సింగిల్ విండో) ఆశించిన ఫలితాలను ఇస్తోంది. వివిధ యూనిట్ల ఏర్పాటుకు ఏకగవాక్ష పద్ధతిలో అనుమతులు జారీ చేస్తుండటంతో పారిశ్రామిక ప్రగతి జోరందుకుంది. సింగిల్ విండో విధానం అమలుతో ఔత్సాహిక పరిశ్రమదారులు యూనిట్ల స్థాపనకు ముందుకు వస్తున్నారు. భారీ పరిశ్రమలకు అనుబంధంగా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. అలాగే వినూత్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. భారీ పరిశ్రమలకు అనుబంధంగా పలు చిన్న, మధ్య తరహా యూనిట్ల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 55 భారీ పరిశ్రమలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆయా పరిశ్రమల్లో 28,367 మంది పనిచేస్తున్నారు. జిల్లాలో అమలుచేస్తున్న సింగిల్ విండో విధానం పట్ల పారిశ్రామికవేత్తలు సంతృప్తి చెందుతున్నారు. 2014-15 సంవత్సరం నుండి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు అధికమయ్యింది. అప్పట్లో జిల్లాలో 1099 యూనిట్లను స్థాపించడం ద్వారా 12వేల 668మందికి ఉపాధి లభించింది. తర్వాత మరో 211 యూనిట్ల స్థాపనతో 3529మందికి ఉపాధి లభించింది. 2015-16 సంవత్సరంలో 547 యూనిట్లు ఏర్పాటు కాగా 4142మందికి ఉద్యోగ, ఉపాధి లభించింది. 2015 అక్టోబర్ 1న ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద జిల్లాకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో 78 యూనిట్ల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకువచ్చారు. సింగిల్ విండో ద్వారా వివిధ యూనిట్లకు సత్వరమే అనుమతులు లభించేందుకు ఆన్‌లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. 2015 ఏప్రిల్ 29న సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టగా ఇప్పటివరకు జిల్లాలో 1397 అనుమతులను వివిధ శాఖల నుండి పరిశ్రమదారులు అనుమతులు పొందారు. అలాగే పరిశ్రమలకు పారిశ్రామిక రాయితీ కింద 667 ప్రతిపాదనలకు రూ.61.33 కోట్లు ప్రభుత్వం విడుదలచేసింది.