ఆంధ్రప్రదేశ్‌

బ్రాహ్మణ కార్పొరేషన్ పనితీరు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), మే 2: గోవులు, బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని పురాణ ఇతిహాసాల కాలం నుండి యుగయుగాల నానుడి అని తూర్పుగోదావరి జిల్లా తుని తపోవనం పీఠాధిపతులు సచ్చిదానంద సరస్వతీ స్వామీజీ అన్నారు. మంగళవారం స్వామి గుంటూరులోని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు నేతృత్వంలో కార్పొరేషన్ సక్రమంగా పనిచేస్తుందన్నారు. పేద బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం వివిధ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టి వారికి సేవలందిస్తుందన్నారు. పూర్వకాలంలో రాజులు బ్రాహ్మణులను ఎటువంటి లోటు లేకుండా ఆదరించేవారన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అటువంటి ఆదరణ కల్పిస్తోందన్నారు. పూర్వికులు బ్రాహ్మణ కార్మిక సంప్రదాయాల కోసం ఇచ్చిన యడవల్లి వారి బ్రాహ్మణ ధర్మసత్రాన్ని బ్రాహ్మణ కార్పొరేషన్‌కు అందజేయడం హర్షించదగ్గ పరిణామమన్నారు. ఐవైఆర్ కృష్ణారావు నేతృత్వంలో బ్రాహ్మణులకు ఉపయోగపడేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు స్వామీజీ తెలిపారు. అనంతరం సత్రం మొత్తాన్ని స్వామీజీ క్షుణ్ణంగా పరిశీలించారు. తొలుత స్వామీజీకి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ జిల్లా కో ఆర్డినేటర్ సిరిపురపు శ్రీ్ధర్ ఆధ్వర్యంలో అర్చకస్వాములు పూర్ణకుంభంతో వేద మంత్రాల నడుమ స్వాగతం పలికారు.

చిత్రం..బ్రాహ్మణ కార్పొరేషన్ భవనాన్ని పరిశీలిస్తున్న సచ్చిదానంద సరస్వతి స్వామి