ఆంధ్రప్రదేశ్‌

నీటిని నిలిపిన వారే మా హీరోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 2: నీరు - ప్రగతి 90 రోజుల ఉద్యమంలో ఎన్ని చెక్‌డ్యాంలు నిర్మించి వాటి ద్వారా ఎంత నీరు నిలుపుతారో వాళ్ళే మా హీరోలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టపడే ఇంజనీరింగ్ అధికారులను గుర్తిస్తారని, గుర్తించడమే కాకుండా తగిన విధంగా గౌరవిస్తారని ఆయన వెలగపూడి సెక్రటేరియట్ నుంచి మంగళవారం రాత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు తెలియజేశారు. వివిధ జిల్లాల సీఈలు, ఎస్‌ఈలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ ప్రాజెక్టుల పురోగతి, నీరు - ప్రగతికి సంబంధించి 90 రోజుల ప్రణాళికలో భాగంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి వివిధ జిల్లా అధికారులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న వివిధ డ్యామ్‌ల డిజైన్లను త్వరగా పరిష్కరించాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పనులకు సంబంధించిన అనుమతులు వెంటనే తీసుకుని చెక్‌డ్యామ్‌లు, ఫామ్‌పాండ్స్ పనులు ప్రారంభించాలన్నారు. రైతు సంఘాలను, ఇంజనీరింగ్ అధికారులను కూర్చోబెట్టి పనులు వేగవంతంగా జరిగేలాగా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 15న నెల్లూరు సంఘం బ్యారేజిని సందర్శిస్తారని, ఆలోపుగా అధికారులు పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని కోరారు. అమరావతి కొండవీటి వాగు పనులు పురోగతిని పరిశీలిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, వరద సంభవించినప్పుడు రాజధాని ప్రాంతంలో ఇబ్బంది లేకుండా పనులు పూర్తి చేయాలన్నారు.
చీఫ్ ఇంజనీర్లు, ఎస్‌ఈలు కాలువగట్ల మీద పనుల పురోగతిని పర్యవేక్షిస్తూ అవసరమైతే ఆ ప్రాంతంలో కంటైనర్లు ఏర్పాటు చేసుకుని ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రిగా జిల్లాకి వచ్చినప్పుడు తాను కూడా అందులోనే ఉండి పనులు పర్యవేక్షిస్తానన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశానుసారం అనుకున్న విధంగా కాలువల పూడికతీత పనులు, చెక్‌డ్యామ్స్, ఫామ్‌పాండ్స్ పనులు పూర్తి చేయాలన్నారు. పనులు జరిగే ప్రాంతాల్లో డ్రోన్లు ఉపయోగించి ఫొటోలు, వీడియోలు అందుబాటులో ఉంచాలన్నారు. కష్టపడి పని చేసి మన జిల్లాని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపచేయిద్దామని తెలిపారు. నిజాయితీగా పని చేస్తూ ఎవరికి బయపడకుండా రైతులకు మేలు జరిగే విధంగా వ్యవహరిద్దామన్నారు. కాలువల పనులు పూర్తి చేయకుండా, డ్యామ్‌ల పనులు పూర్తి చేయకుండా మాట్లాడవద్దని ముఖ్యమంత్రి కష్టపడేవారిని గౌరవిస్తారని తెలిపారు. మండ్రి వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, వివిధ జిల్లాల సీఈలు, ఎస్‌ఈలు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.