ఆంధ్రప్రదేశ్‌

యువతే బలం..ప్రతిభ అపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెట్టుబడులకు అనువైన రాష్ట్రం ఏపి
యాపిల్ సిఓఓ విలియమ్స్‌తో చంద్రబాబు భేటీ

అమరావతి, మే 6:సుస్థిర వృద్ధి ఫలితాలు సాధిస్తూ బలీయమైన దేశంగా ఎదుగుతున్న భారత్‌లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవాలని తనతో భేటీ అయిన యాపిల్ సీఓఓ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) జెఫ్ విలియమ్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం పలికారు. భారతదేశంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా పేర్కొన్నారు. వృద్ధి, అభివృద్ధి అంశాల్లో సరైన భాగస్వామ్యం కోసం అనే్వషిస్తున్నామన్నారు. వ్యాపార దక్షత, సమర్థత, అపారమైన తెలివితేటలు తమ ప్రజల సొంతమని చెప్పారు. ప్రపంచ దేశాలతో సరి చూసుకుంటే అత్యధిక సంఖ్యలో యువత భారతదేశంలోనే ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి బృందం అమెరికా పర్యటన రెండోరోజు ఈ భేటీ జరిగింది.
పైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై క్వాల్‌కమ్ టెక్నాలజీస్ ఆసక్తి
ముఖ్యమంత్రితో క్వాల్‌కమ్ టెక్నాలజీస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గోపి సిరినేని, డైరెక్టర్ ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ చందన పైరాలతో సమావేశం అయ్యారు. టెలికమ్యూనికేషన్స్ రంగంలో ప్రఖ్యాతి గాంచిన క్వాల్‌కమ్ టెక్నాలజీస్ రాష్ట్రంలో చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ఆసక్తి కనబరిచింది. ముందుగా ప్రాజెక్టును అధ్యయనం చేసి ఏయే అంశాల్లో సహకరించగలరో పరిశీలించి చెప్పాలని గోపి సిరినేనికి ముఖ్యమంత్రి సూచించారు. డ్రైవర్ లేని కార్లు, డ్రోన్ల ద్వారా గృహావసరాలకు వివిధ ఉత్పత్తుల సరఫరా చేసే ప్రదర్శనను ముఖ్యమంత్రి తిలకించారు. అనంతరం స్ట్రాటోస్పియర్ బెలూన్స్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించే విభాగాధిపతి అలిస్టర్‌తో సమావేశమయ్యారు. అలాగే లాస్‌ఏంజెలిస్‌లో టెస్లా ప్రెసిడెంట్ సీఎఫ్‌ఓ ఎలొన్ మస్క్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు.

చిత్రం... యాపిల్ సంస్థ సిఓఓ జెఫ్ విలియమ్స్‌కు బుద్ధ విగ్రహం
బహూకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు