ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో ఇంటర్‌నెట్ విస్తృతికి గూగుల్ ఎక్స్ ఓకె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 6: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి గూగుల్ ఎక్స్ ముందుకొచ్చింది. మారుమూల ప్రాంతాలకు ఇంటర్‌నెట్‌ను విస్తృతం చేసేలా సహకారం అందించేందుకు సంసిద్ధత తెలిపింది. గూగుల్ ఎక్స్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందర్శించారు. మారుమూల ప్రాంతాలకూ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించే విషయంలో సహకారం ఆశిస్తున్నట్టు ముఖ్యమంత్రి గూగుల్ ఎక్స్ ప్రతినిధులను కోరగా వారు ఇందుకు సుముఖత తెలిపారు. అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి బృందం గూగుల్ ఎక్స్ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించింది. గూగుల్ ఆవిష్కరణలకు ఈ ప్రాంతం నెలవు కావడంతో సాధారణంగా ఇక్కడకు అందరికీ ప్రవేశం ఉండదు. గూగుల్ డ్రైవర్ లెస్ కార్, గూగుల్ గ్లాసెస్, బెలూన్స్ ఉపయోగించి ఇంటర్‌నెట్ అందించడం వంటి ప్రయోగాలకు ఇదే వేదిక. గూగుల్ ఎక్స్ సిఇఓ అస్ట్రో టెల్లర్ తన ప్రజంటేషన్ ద్వారా మరిన్ని వివరాలు తెలిపారు. ఈ తరహా ఆవిష్కరణలకు, వినూత్న ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్‌ను వేదిక చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. బాగా పొద్దుపోయిన తర్వాత ముఖ్యమంత్రి గూగుల్ వైస్ ప్రెసిడెంట్ టామ్ మూర్‌ను కలిసారు. గూగుల్ నూతన ఆవిష్కరణల గురించి టామ్ ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే సెమి కండక్టర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (ఐపి)లో ప్రపంచ అగ్రశ్రేణి సప్లయర్‌గా ఉన్న ఎఆర్‌ఎం హోల్డింగ్స్ సంస్థ సిఇఓ సైమన్ ఆంథోనీ సెగర్స్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఎఆర్‌ఎం హోల్డింగ్స్ ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్‌పై ప్రస్తుతం దృష్టి నిలిపింది. పాలనలో, అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో సాంకేతికతను తమ ప్రభుత్వం ఎలా అందిపుచ్చుకున్నదీ సైమన్‌కు ముఖ్యమంత్రి తెలిపారు.

చిత్రం... గూగుల్ డ్రైవర్ రహిత కారు వద్ద సిఎం