ఆంధ్రప్రదేశ్‌

పదిలో బాలికలదే ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెన్త్ ఫలితాల్లో తూర్పు గోదావరి ఫస్ట్ ఆఖరి స్థానంలో చిత్తూరు
4,102 స్కూళ్లలో వంద శాతం ఫలితాలు గతేడాదికన్నా 2.6 తగ్గిన ఉత్తీర్ణత శాతం

విశాఖపట్నం, మే 6: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మళ్లీ బాలికలే పైచేయి సాధించారు. పరీక్ష ఫలితాలను మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం ఇక్కడ విడుదల చేశారు. ఈ సంవత్సరం మార్చిలో నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు 6,22,538 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 6,09,502 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 13,036 మంది ప్రైవేటు విద్యార్థులు. రాష్ట్రం మొత్తంమీద 91.92 శాతం మంది రెగ్యులర్ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 91.87 మంది బాలురు కాగా, 91.97 మంది బాలికలు. అలాగే 63.38 శాతం మంది ప్రైవేటు విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ సంవత్సరం 4,102 పాఠశాలలు వంద శాతం ఫలితాలను సాధించాయి. ప్రైవేటు యాజమాన్యం కింద నడుస్తున్న రెండు స్కూళ్లకు సున్నా ఫలితాలు వచ్చాయి. ఈ పరీక్షల్లో 97.97 శాతం ఫలితాలను సాధించి తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 80.55 ఫలితాలతో చిత్తూరు జిల్లా చివరి స్థానాన్ని దక్కించుకుంది. రాష్టవ్య్రాప్తంగా ప్రైవేటు స్కూల్స్‌లో 97.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 82.02 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదికన్నా, ఈ సంవత్సరం ఉత్తీర్ణతా శాతం 2.6 తగ్గింది. మేనేజ్‌మెంట్ల వారీగా ఉత్తీర్ణతా శాతాలను పరిశీలిస్తే.. ఎయిడెడ్ స్కూల్స్ 86.51 శాతం, బిసి వెల్ఫేర్ స్కూల్స్ 95.84, ప్రభుత్వ స్కూల్స్ 84.29, కెజిబివి స్కూల్స్ 91 శాతం ఫలితాలు సాధించాయి. అలాగే మోడల్ స్కూల్స్ 94.32 శాతం, మున్సిపల్ స్కూల్స్ 86.67, ప్రైవేట్ స్కూల్స్ 97.26, ఎపిఆర్‌ఎస్ స్కూల్స్ 96.37, ఎపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 93.45, ఎపి ట్రైబుల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 82.02, జెడ్ స్కూల్స్ 89.23 శాతం ఫలితాలను సాధించాయి. వంద శాతం ఫలితాలు సాధించిన స్కూళ్లలో గవర్నమెంట్ స్కూల్స్ 117, జిల్లా పరిషత్ స్కూల్స్ 1181, ఎపి మోడల్ స్కూల్స్ 61, మున్సిపల్ స్కూల్స్ 22, ఎపిఆర్‌ఇఐ స్కూల్స్ 27, ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌ఇఐ స్కూల్స్ 52, ఎపి టిడబ్ల్యుఆర్‌ఇఐ స్కూల్స్ 30, కెజిబివి స్కూల్స్ 56, బిసి వెల్ఫేర్ స్కూల్స్ 12, ఎయిడెడ్ స్కూల్స్ 65, ప్రైవేట్ స్కూల్స్ 2,479 ఉన్నాయి.
10 జిపిఎ సాధించిన విద్యార్థుల్లో ఎయిడెడ్ స్కూల్స్‌లో 123 మంది, బిసి వెల్ఫేర్ స్కూల్స్‌లో ఆరుగురు, గవర్నమెంట్ స్కూల్స్‌లో 44 మంది, కెజిబివి స్కూల్స్‌లో ఇద్దరు, మోడల్ స్కూల్స్‌లో 153 మంది, మున్సిపల్ స్కూల్స్‌లో 49 మంది, ప్రైవేట్ స్కూల్స్‌లో 17,209 మంది, ఎపిఆర్‌ఎస్‌లో ముగ్గురు, ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌ఎస్‌లో 15 మంది, ఎపిటిడబ్ల్యుఆర్‌ఎస్‌లో ఇద్దరు, జెడ్‌పి స్కూల్స్‌లో 619 మంది ఉన్నారు.
జిల్లాల వారీగా ఉత్తీర్ణత శాతం ఈ విధంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా 95.10 శాతం, విజయనగరం జిల్లా 93.36, విశాఖ జిల్లా 93,69, తూర్పు గోదావరి జిల్లా 97.97, పశ్చిమ గోదావరి 84.30, కృష్ణా జిల్లా 93.01, గుంటూరు జిల్లా 94.02, ప్రకాశం జిల్లా 91.78, నెల్లూరు జిల్లా 94.80, చిత్తూరు జిల్లా 80.55, కడప 95.02, అనంతపురం జిల్లా 88.48, కర్నూలు జిల్లా 93.40 శాతం ఫలితాలను సాధించాయి.
జూన్ 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
జూన్ 14 నుంచి 28వ తేదీ వరకూ టెన్త్ సప్లిమెంట్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి ఈనెల 29వ తేదీలోగా ఫీజును స్కూల్ హెడ్మాస్టర్లకు చెల్లించవలసి ఉంటుంది. వారు ఈనెల 30వ తేదీలోగా ట్రెజరీల్లో జమ చేయాలి. అలాగే, జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ కోసం వెయ్యి రూపాయలు చెల్లించి దరఖాస్తులను ఈనెల 20లోగా చెల్లించాలి. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్ జిరాక్స్‌తోపాటు, సంబంధిత హెడ్‌మాస్టర్ సంతకం చేసిన దరఖాస్తును డిఇఓ కార్యాలయంలో సమర్పించాలి.
ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు అంతంతమాత్రంగా ఉండడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోందన్నారు. విద్యా బోధన, పాఠశాలల నిర్వహణ, అధిక శాతం పరీక్షా ఫలితాలు రాకపోవడం తదితర అంశాల్లోని లోపాలపై విచారణ జరిపిస్తామని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు. టీచర్ల బదిలీల సమయంలో వారి పెర్ఫార్మెన్స్‌కు వెయిటేజ్ ఇస్తామని గంటా తెలిపారు.

చిత్రం... టెన్త్ ఫలితాలు విడుదల చేస్తున్న మంత్రి గంటా