ఆంధ్రప్రదేశ్‌

విత్తనోత్పత్తిలో కొత్త పుంతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 7: దేశానికే అన్నపూర్ణ అనిపించుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో విత్తన ఉత్పత్తి, పరిశోధనలకు సంబంధించి అమెరికాలోని ఐయోవా రాష్ట్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయ రంగం లో ఎపికి ఐయోవా నుంచి నిరంతర సహకారానికి ఈ ఒప్పందం దోహపడనుంది. అక్కడి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ భవనంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి జరిగిన సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఐయోవా స్టేట్ వర్శిటీకి చెందిన సీడ్ సైన్స్ సెంటర్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఐయోవా వ్యవసాయ మంత్రి బిల్ నోర్తి సంతకాలు చేశారు. కరవు, ఆహార సమస్యలపై పోరాడిన మహాత్మాగాంధీ, జార్జ్ వాషింగ్టన్ చిత్రపటాల ముందు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడం గమనార్హం. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను గమనిస్తున్నామని, తదనుగుణంగా మారుతూ వస్తున్నామని ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రజల ఆహార అలవాట్లు కూడా మారిపోయాయని, గతంలో ఆహార ధాన్యాల వినియోగం బాగా ఉండేదని గుర్తుచేశారు. ప్రస్తుతం పండ్లు, చేపలు, కోళ్లు, మాంసాహార వినియోగం ఎక్కువైందన్నారు. విత్తనాభివృద్ధికి, పరిశోధనలకు ఈ ఒప్పందం కీలకం కానుందన్నారు. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తులు పెంచవచ్చని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. బిల్ నోర్తి మాట్లాడుతూ ఐయోవాకు, ఆంధ్రప్రదేశ్‌కు అనేక విధాలుగా సారూప్యత ఉందన్నారు. రెండు రాష్ట్రాలూ వ్యవసాయ ప్రధానమైనవేనని తెలిపారు. బ్రెజిల్, చైనాలతో పోటీపడుతున్నామని, జొన్న, మొక్కజొన్న, సోయా పంటల్లో అగ్రగామిగా ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు కెన్నత్ క్వీన్, చికాగోలో భారత్ తరపున కౌన్సిల్ జనరల్‌గా ఉన్న నీతా భూషణ్ తదితరులు పాల్గొన్నారు. బయోవా రాష్ట్ర రాజధాని డి మోయిన్స్‌లో అక్కడ ప్రవాస తెలుగువారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సత్కరించారు.