ఆంధ్రప్రదేశ్‌

ప్రశాంతంగా నీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభ్యర్థులకు మెటల్ డిటెక్టర్ పరీక్షలు
విజయవాడలో 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని
అనుమతి నిరాకరించిన అధికారులు

విజయవాడ, మే 7: ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబిబిఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు, తిరుపతి నగరాల్లో జరిగిన ‘నీట్’ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా జరిగింది. అభ్యర్థులు ధరించే దుస్తులు, ఆభరణాలు చివరకు చెప్పులపై కూడా కఠినమైన ఆంక్షలు ఉండటంతో పరీక్ష కేంద్రాల్లో ఉదయం 7.30 నిమిషాల నుంచే మెటల్ డిటెక్టర్లు, వీడియో కెమెరాలతోనూ శల్యపరీక్షలు చేశారు. ఆడపిల్లల ముక్కుపుడకలను, కొందరు మగపిల్లలు పెట్టుకున్న చెవిపోగులను పరీక్ష కేంద్రాలకు వెలుపలే తొలగించారు. దీనిపై కొన్ని కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో 11 ప్రభుత్వ, 18 ప్రైవేట్ వైద్య కళాశాలలతోపాటు పద్మావతి వర్సిటీ వైద్య కళాశాల, గీతం డీమ్డ్ వర్శిటీ కళాశాల సహా మొత్తం 4,650 సీట్లు ఉండగా దాదాపు 80వేల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఒక్కో సీటుకు దాదాపు 18 మంది పోటీపడినట్లయింది. మొత్తంపై పరీక్ష ప్రశాంతంగా జరిగింది. విజయవాడ కెబిఎన్ కళాశాల కేంద్రంలో ఏలూరుకు చెందిన లాంగ్‌టర్మ్ కోచింగ్ విద్యార్థిని సత్యశాలిని 5 నిమిషాలు ఆలస్యం వచ్చిందని అనుమతి నిరాకరించారు. దీంతో ఆమె గేటు వెలుపల భోరున విలపించింది.
ప్రశాంతంగా గ్రూప్-1 స్క్రీనింగ్ పరీక్ష
గ్రూప్-1 స్క్రీనింగ్ పరీక్ష కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 22 పరీక్ష కేంద్రాల్లో 9,522 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 5,069మంది హాజరయ్యారు. కలెక్టర్ బి లక్ష్మీకాంతం పలు కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లు పర్యవేక్షించారు.

చిత్రం... ఓ పరీక్ష కేంద్రం వద్ద ఉంగరాలు, దుద్దులు తీసి
తల్లిదండ్రులకు అప్పగిస్తున్న విద్యార్థినులు