ఆంధ్రప్రదేశ్‌

అక్రమాల మురుగు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్టీపీ భూములు అన్యాక్రాంతం రూ.కోట్ల నిధులు గోల్‌మాల్

రాజమహేంద్రవరం, మే 7: జాతీయ నదీ జలాల శుద్ధి పథకంలో భారీ అక్రమాలు బయటపడ్డాయి. ఈ పథకంలో భాగంగా రూ. 10.83 కోట్ల నిధులతో రాజమహేంద్రవరంలో నిర్మించిన సీవేజ్ ట్రీట్‌మెంట్ (మురుగునీటి శుద్ధి) ప్లాంట్‌లో దాదాపు రూ. 3 కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టినట్టు తేలింది. రాష్ట్రంలో గోదావరి నదీ పరీవాహక ప్రధాన నగరాల్లో మురుగు నీటి కాలుష్య నివారణలో భాగంగా నదీ ప్రక్షాళనకు ఈ పథకం చేపట్టారు. ఇందులో నిధులు గోల్‌మాల్ కావడమే కాకుండా ఈ పథకం కోసం సేకరించిన భూములు అన్యాక్రాంతమయ్యాయి. జాతీయ నదీ జల కాలుష్య నివారణ పథకంలో భాగంగా గోదావరి పరీవాహకంలో ఉన్న నగరాల్లోని మురుగునీటి ప్రక్షాళనకు గాను భద్రాచలం, మంచిర్యాల, రాజమహేంద్రవరం పట్టణాల్లో పనులు మంజూరయ్యాయి. 2002లో ఈ పథకం కింద 31.85 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి.రాజమహేంద్రవరం నగరంలో నదీ కాలుష్యాన్ని నివారించేందుకు ఎస్టీపీ ప్లాంట్ (సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్)ను నిర్మించారు. ఈ ప్లాంట్ కోసం 42 ఎకరాలను సేకరించారు. ఎస్టీపీ ప్లాంట్‌ను పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్ నిర్మించి నగరపాలక సంస్థకు అప్పగించింది. భూసేకరణ నిధులు, నిర్మాణ నిధులు జమా ఖర్చుల ఆడిట్ వివరాలు కూడా మాయం చేశారు. లెక్కలు కూడా బయటపడకుండా జాగ్రత్త పడ్డారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పథకంలో రోజుకు 30 మిలియన్ లీటర్ల(ఎంఎల్‌డి) సామర్థ్యంగల ఎస్టీపీ నిర్మాణంలో నిబంధనలు తుంగలో తొక్కారు. తప్పుడు అంచనాలతో అక్రమ నిర్మాణం చేశారని తేలింది. భూసేకరణకు 1,83,47,600 ఖర్చు చేసినట్టు లెక్కలు చూపించారు. కాని రైతులకు భూసేకరణ పరిహారంగా 1,15,399,55 మాత్రమే చెల్లించారు. దీని ప్రకారం రూ.68,07,645 నిధులు పక్కదారి పట్టాయి. ఇక నిర్మాణానికి ఖర్చు చేసిన నిధుల్లో రూ. కోటి 73 లక్షలు పైబడి గోల్‌మాల్ అయ్యింది. వాస్తవానికి ఈ ప్లాంట్ నిర్మాణానికి 10,83,28,617 రూపాయలు ఖర్చు చేసినట్టు చూపించారు.
ఇక భూసేకరణ, నిర్మాణ నిధులకు సంబంధించి ఆడిట్ వివరాలు సైతం గల్లంతయ్యాయి. భూసేకరణకు సంబంధించిన నిధులపై అసలు అడిట్టే జరగలేదని ఒప్పుకుంటూ పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్ ఎస్‌ఇ లిఖితపూర్వకంగా తెలియజేశారు. ప్లాంట్ కోసం కేటాయించిన 42 ఎకరాలను ముందుగా లేఅవుట్ చేసి కామన్ సైట్‌ను విభజన చేసి రోడ్లను కూడా నిర్మించాల్సి ఉంది. లే అవుట్ చేయకుండా 10 శాతం సామాజిక స్థలం 1975 మాస్టర్ ప్లాన్ రోడ్లను కలుపుతూ అక్రమ నిర్మాణం చేపట్టారు. దీనిపై టౌన్ అండ్ కంట్రీప్లాన్ సంస్థ కూడా పట్టించుకోలేదు. 80 అడుగుల రోడ్డు, 60 అడుగుల రోడ్డు, 40 అడుగుల రోడ్లు ఎనిమిది మొత్తం వైశాల్యం 5.92 ఎకరాలు కలుపుకుని ఎస్టీపీ నిర్మించారు. మాస్టర్ ప్లాన్ రోడ్లను, కామన్ సైట్‌ను సైతం కబళించి ఎస్టీపీ నిర్మించారు. చిత్రమేమిటంటే మురుగునీటి శుద్ధి కర్మాగారానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి కూడా లేదు. దీనికి తోడు ఎస్టీపీ నిర్మాణానికి పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేవు. 2026 సంవత్సరం వరకు సరిపడా ప్లాంట్ నిర్మించామని చెప్పి, ఇపుడు మళ్లీ మరో రూ. 300 కోట్లు కేటాయించి మరో ప్లాంట్ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

చిత్రం... రాజమహేంద్రవరంలో మురుగునీటి శుద్ధి పథకం ప్లాంటు