ఆంధ్రప్రదేశ్‌

మీరు ప్రధాని కన్నా పవర్‌ఫుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 9: రైల్వే అధికారులు ఎంతో వపర్‌ఫుల్.. పార్లమెంట్ సభ్యులు కాదుకదా ముఖ్యమంత్రి, రైల్వే మంత్రి చివరకు ప్రధాన మంత్రి చెప్పినా వారు బేఖాతరు చేస్తున్నారని నర్సరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు అధికారులపై విరుచుపడ్డారు. రాష్ట్రంలోని రైల్వే సమస్యల పరిష్కారంపై ఆంధ్ర ప్రాంత పార్లమెంట్ సభ్యులతో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్‌లతో కలిసి మంగళవారం నిర్వహించిన కీలక సమావేశం వాడిగా వేడిగా సాగింది. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు దాటుతున్నా విజయవాడ జోన్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యం పట్ల పార్టీల కతీతంగా సభ్యులందరు ఆగ్రహించారు. కొందరు సభ్యులు తమతమ ప్రాంత సమస్యలను ప్రసావిస్తూ గతంలో అనేకమార్లు నివేదించినప్పటికీ ఫైళ్లు మాత్రం కదలటం లేదంటూ మండిపడ్డారు. ఇక ఎంపి రాయపాటి అయితే ఏకంగా సమావేశం నుంచి అర్ధంతరంగా వాకౌట్ చేశారు. అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రైల్వేమంత్రి చెప్పినా రైల్వే అధికారులు లెక్క చేయడం లేదని, వారు ప్రధానికన్నా పవర్‌ఫుల్ అని వ్యాఖ్యానించారు. చిన్న చిన్న పనులు కూడా అధికారులు చేయడంలేదని, ఇలాగయితే ప్రజలు తమను చెప్పుతో కొడతారని ఆయన అన్నారు. కొండవీడు ఎక్స్‌ప్రెస్, హౌరా, ప్రశాంతి నిలయం ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వినుకొండలో పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు పెదకూరపాడు, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు సిరిపురంలో భువనేశ్వర్- పూణే ఎక్స్‌ప్రెస్‌లకు పిడుగురాళ్లలో హాల్ట్ ఏర్పాటు చేయాలని కోరుతున్నామని, జిఎం తన విచక్షణాధికారాలతో చేసే పనులకు కూడా బోర్డుకు పంపామని సమాధానమివ్వటం సమంజసం కాదన్నారు. తాను ఇప్పటి వరకు ఆరు పర్యాయాలు ఎంపిగా పనిచేశానని చెప్తూ తమ వద్ద నుంచి ప్రతిపాదనలు స్వీకరించటం ఆపై బోర్డు పరిశీలనలో ఉందని బదులివ్వటం షరా మామూలుగా మారుతోందన్నారు. సమావేశాలకు వచ్చి టి, కాఫీ తాగి భోజనాలు చేసి వెళ్లడం రివాజుగా మారుతోందని అసహనం వ్యక్తంచేశారు. ప్రజలు నిలదీస్తుంటే ఏరకంగా సమాధానం చెప్పాలో అర్ధం కావటంలేదన్నారు. పదేళ్ల క్రితం ప్రారంభమైన గుంటూరు- తెనాలి డబ్లింగ్ పనులు ఇప్పటి వరకు పూర్తికాలేదన్నారు. నడికుడి- శ్రీకాళహస్తి పనులు ముందుకు సాగటంలేదని అధికారుల దృష్టికి తెచ్చారు. నల్లపాడు- పగిడిపల్లి విద్యుద్దీకరణ పనులకు ఇప్పటి వరకు మోక్షం కలగలేదన్నారు. గుంటూరు- తిరుపతి- చెన్నైకు పగటిపూట ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రతిపాదనలు సమర్పించినా చలనంలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇక విశాఖ రైల్వే జోన్ అధికారుల వల్లే రాలేదని, విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడం బోర్డు అధికారులకు ససేమిరా ఇష్టంలేదని అన్నారు. అసలు ముందు రైల్వే జోన్‌ను ప్రకటిస్తే తర్వాత చిన్నగా విశాఖకు తరలించవచ్చన్నారు. తాను మాట్లాడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోపం వస్తుందని, అయినా తాను మాట్లాడతానని రాయపాటి అన్నారు. చంద్రబాబు పదిసార్లు ప్రధానిని కలిసినా రైల్వే జోన్ ఎందుకు రావడంలేదని ఆయన ప్రశ్నించారు. దీనిపై సిఎంకానీ, పార్టీనేతలు కానీ ఆలోచించడం లేదని, కొద్దిరోజులు ఆగితే రైల్వేజోన్‌ను కూడా మర్చిపోవడమే అని అన్నారు. ప్రతి ఏటా సమావేశాలు పెట్టి విందు భోజనాలతో సరిపెడుతున్నారన్నారు. టిడిపి ఎంపీలు పలువురు మాట్లాడుతూ ఇప్పటివరకు ఇతర రాష్ట్రాలకు చెందినవారు రైల్వే మంత్రులు కావటం వల్ల కూడా పనులు నత్తనడకన జరుగుతున్నాయని విమర్శించారు. వైకాపా ఎంపీలు కల్పించుకుంటూ తెలుగుదేశం పుణ్యమాని రైల్వే మంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రాతినిధ్యం వస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఏదిఏమైనా రైల్వేపరంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి అభివృద్ధి జరగటంలేదని ముక్తకంఠంతో విమర్శించారు. ఈ సమావేశంలో ఎంపీలు తోట నరసింహం, శ్రీరామ్ మాల్యాద్రి, డాక్టర్ వి వరప్రసాదరావు, రాయపాటి సాంబశివరావు, బుట్టా రేణుక, జెసి దివాకరరెడ్డి, నిమ్మల కిష్టప్ప, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పివి మిథున్ రెడ్డి, మాగంటి మురళీమోహన్, మాగంటి బాబు, అవినాష్ రెడ్డి, గోకరాజు గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.
హామీలు నెరవేరుస్తాం: జిఎం
ఎంపీలు ఇచ్చిన వినతిపత్రంలో ఉన్న డిమాండ్ల సాధనకు తనవంతు కృషి చేస్తానని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ అన్నారు. ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ (ఇటిటిసి)లో ఏర్పాటు చేసిన ఎంపిల సమావేశానంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఎంపీలు ముందుపెట్టిన డిమాండ్లలో తన పరిధిలో ఉన్నవాటిని పరిష్కరిస్తానని చెప్పారు. మిగిలినవి ఏమైనా ఉంటే రైల్వేబోర్డు దృష్టికి తీసుకెళతామన్నారు. కొందరు ఎంపీలు కొన్ని స్టేషన్‌లలో హాల్ట్ కావాలన్నారని, కొన్ని రైళ్లు కావాలని కోరారని చెప్పారు. ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లతో పాటు ప్లాట్‌ఫారాలు అభివృద్ధి చేయాలని కోరారన్నారు. కోస్తా కారిడార్ కోసం రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం వచ్చిందని, త్వరలోనే సర్వే ప్రారంభిస్తామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో చీఫ్ కమర్షియల్ మేనేజర్ గుణశేఖరం, డిఆర్‌ఎం ధనుంజయ, ఐదు డివిజన్ల డిఆర్‌ఎంలు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న ఎంపి రాయపాటి సాంబశివరావు