గుంటూరు

తొలిఘట్టం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 25: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో తొలి అంకం పూర్తికావచ్చింది. తాత్కాలిక సచివాలయం ప్రారంభంతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జూన్ 15 నాటికి 4 వేల మంది ఉద్యోగులతో పాటు కీలకమైన ప్రభుత్వ శాఖలను అమరావతికి తరలించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇకపై పరిపాలన ఇక్కడి నుంచే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం తెల్లవారుఝామున 4.01 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయ తాత్కాలిక భవనాలను ప్రారంభించారు. మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఇక్కడ తొలి సంతకంతో విధివిధానాలను ప్రకటించడం అమరావతి చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తోంది. రాజధాని భూసమీకరణ నుంచి ఇప్పటివరకు అలుపెరుగక శ్రమించిన మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌లను ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులు ప్రశంసించారు.
కారుచీకటి నుంచి
క్రాంతిపథంలోకి: స్పీకర్ కోడెల
విభజన అనంతరం రాష్ట్రానికి రాజధానిని కూడా కోల్పోయామని, ప్రభుత్వం ఏర్పాటైన 22నెలల్లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించడం చారిత్రాత్మకమని శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. కారుచీకట్లో నుంచి కాంతిపథంలోకి రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో పయనిస్తోందనటానికి ఇది నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కష్టపడి పనిచేస్తారని, ఆయనకు 24 గంటలు కూడా సరిపోవన్నారు. రాష్ట్రం నుంచి పాలన ప్రారంభిస్తే ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుందని ఆయన చెప్పారు.
చేతల మనిషి ముఖ్యమంత్రి: మండలి
ముఖ్యమంత్రి చంద్రబాబు చేతల మనిషిగా నిరూపించుకున్నారని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. నిధులు లేకుండా విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రే ఓ నిధిగా మారారని అభివర్ణించారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు కుల, మత, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడుతున్నాయని, ఈ కుతంత్రాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
రైతుల వల్లే ప్రపంచ ఖ్యాతి: చక్రపాణి
రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిచ్చిన రైతుల వల్లే ప్రపంచస్థాయి నగర నిర్మాణానికి మార్గం సుగమమైందని శాసనమండలి చైర్మన్ చక్రపాణి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి తనతో పాటు మంత్రివర్గ సహచరులు, అధికారులను సమష్టిగా కలుపుకుని శ్రమించడం అభినందనీయమన్నారు. ఆంధ్రులంటే అన్నిస్థానాల్లో అగ్రగామిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
అన్నిప్రాంతాల అభివృద్ధే ధ్యేయం: చినరాజప్ప
ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో రాజధానితో పాటు అన్ని ప్రాంతాలను సమతుల్యంగా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ ధ్యేయంగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ విజన్ ఉందన్నారు. లక్ష్యసాధనలో ఆయన ఏమాత్రం వెనుకడుగు వేయరని ఆయన పేర్కొన్నారు.
అమరావతి సృష్టికర్త: మంత్రి పుల్లారావు
సచివాలయ భవనాలను 62 రోజుల్లో పూర్తిచేయటం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అంశమని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రైతులు ప్రభుత్వంపై నమ్మకం ఉంచారని గుర్తుచేశారు. దేశంలో ఏప్రాంతంలో అయినా భూసమీకరణ జరపాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు సలహాలు, సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ 5 నెలల్లో పట్టిసీమను పూర్తిచేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
ఇక వౌలిక సదుపాయాలపై దృష్టి: మంత్రి నారాయణ
రాజధాని సచివాలయ భవనాలు మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంటాయని, ఇకపై రోడ్లు, ఇతర వౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అమరావతికి తూర్పు- పశ్చిమ దిశగా రెండు, దక్షిణ- ఉత్తర దిశగా మరో రెండు ప్రధాన రహదార్లను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే నెలలో టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. ప్రతినెలా రాజధాని ప్రతిపాదిత గ్రామంలో ఒక్కోరకమైన వౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
నాడు ఇంద్రుడు.. నేడు చంద్రుడు: మంత్రి రఘునాథరెడ్డి
రాష్ట్ర చరిత్రలో సచివాలయ నిర్మాణం సువర్ణ్ధ్యాయమని సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. నాడు ఇంద్రుడు దివిలో అమరావతి నిర్మిస్తే, నేడు చంద్రుడు భువిపై అదే నగరాన్ని నిర్మిస్తున్నారని ఆయన అభివర్ణించారు.
ఇదో అద్భుత ద్వీపం : మంత్రి మాణిక్యాలరావు
అసాధ్యమనుకున్న నదుల అనుసంధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సుసాధ్యం చేశారని, అమరావతి నిర్మాణాన్ని అల్లావుద్దీన్ అద్భుత ద్వీపంలా తొలిదశను అనతికాలంలోనే తీర్చిదిద్ది ఘనత వహించారన్నారు. శంకుస్థాపన జరిగిన రెండు నెలల్లోనే గృహప్రవేశమైన సందర్భాలు అరుదుగా వుంటాయని చెప్పారు. ప్రపంచంలోనే నూతన ఆవిష్కరణకు చంద్రబాబు శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ దేశాలకు ఆదర్శం: మంత్రి రావెల
రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం ప్రపంచ దేశాలకు మార్గదర్శకం కావాలని మంత్రి రావెల కిషోర్‌బాబు ఆకాంక్షించారు. ఇప్పటివరకు అనేక నిర్మాణాలు జరిగినా చరిత్రపుటల్లో అమరావతి చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. విశ్వసనీయతే తమకు కొండంత బలంగా చెప్పారు. రైతులు తనపై ఉంచిన నమ్మకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకుంటున్నారని ఆయన అన్నారు.
త్వరలోనే శాశ్వత భవనాలు: అజయ్ జైన్
తాత్కాలిక సచివాలయంలో విధులు నిర్వర్తించేందుకు అనువుగా ఉద్యోగులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని, త్వరలోనే శాశ్వత భవనాలను కూడా ప్రారంభిస్తామని సీఆర్డీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ వెల్లడించారు.
కొన్ని సమస్యలు పరిష్కారం కావాలి: మురళీకృష్ణ
రాజధాని అమరావతికి వచ్చేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని, అయితే కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ వ్యాఖ్యానించారు. ఉద్యోగుల తరలింపులోగా మరోసారి ప్రభుత్వంతో సమావేశమై చర్చిస్తామని ఆయన చెప్పారు.