ఆంధ్రప్రదేశ్‌

అప్పులుంటే ఉద్యోగం ఇవ్వరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: బ్యాంకులకు అప్పులు ఉంటే ఉద్యోగం ఇవ్వబోమని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగ ప్రకటనలో పేర్కొనడం విడ్డూరమని యువజన, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసు క్లియరెన్స్ సర్ట్ఫికేట్ సైతం తొలగించాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఎస్‌బిఐ మాత్రం క్లరికల్ రిక్రూట్‌మెంట్‌కు విద్య, వ్యక్తిగత, వాహన, గృహ రుణాలు తీసుకుని ఉంటే వారు అనర్హులనే నిబంధన తీసుకురావడం విడ్డూరమని డివైఎఫ్‌ఐ అధ్యక్షుడు పి మాధవ్, కార్యదర్శి ఎం సూర్యారావులు పేర్కొన్నారు. దేశంలో అతి పెద్ద బ్యాంకు అయిన ఎస్‌బిఐ 17వేల క్లరికల్ స్థాయి పోస్టుల భర్తీకి ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఈ కొత్త నిబంధనలు చేర్చిందని, నోటిఫికేషన్ మధ్యలో అర్హతల్లో మార్పులు చేయడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు. మొండి బకాయిలు 4 లక్షల కోట్లు ఉంటే వాటిని ఎగ్గొట్టిన వారిని పట్టుకోవడం మానేసి, ఆ సాకు చూపి నిరుద్యోగ యువత ఉపాధితో ఆడుకోవడం సమంజసం కాదని , విద్యా రుణం ఉపాధిలో చేరిన తర్వాతనే చెల్లించడం సాధ్యమవుతుందని, ఉపాధిలో చేరిన తర్వాత చెల్లించకపోతే చర్యలు తీసుకోవాలే తప్ప ఉద్యోగంలో చేరకముందే అప్పు ఉంది కనుక అనర్హుడవుతాడని పేర్కొనడం నిరుద్యోగులతో ఆడుకోవడమేనని వారు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తీసుకున్న అప్పుకు నిరుద్యోగులను బలిచేయడం చాలా అన్యాయమని, పోలీసు కేసులో ఉన్నవారంతా నిందితులే తప్ప ముద్దాయిలు కాదని గుర్తించాలని అన్నారు.